Tiger Reserve Forest : పులి.. ఈ పేరు వినిపిస్తే చాలు నూటికి నూరు మంది భయపడతారు. అలాంటి పులులకు మన దేశం లోని ఈ ప్రాంతాలు పెట్టని కోటలు. ఇంతకీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
* సాత్పురా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
సాత్పూరా నేషనల్ పార్క్ లో దాదాపు 50 వరకు పులులు ఉన్నాయి. ఈ దట్టమైన అడవిలో అడవి పందులు, ఎలుగుబంట్లు, చిరుతలు కూడా ఉన్నాయి. విభిన్నమైన అడవి కుక్కలను కూడా ఈ అరణ్యంలో చూడవచ్చు.
*సుందర్ బన్ నేషనల్ పార్క్, పశ్చిమబెంగాల్
పశ్చిమ బెంగాల్లో సుందర్ బన్ అడవులు చాలా ప్రత్యేకమైనవి. ప్రపంచంలో అతిపెద్ద మడ అడవులుగా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ పులులను చూడడం ఒకరకంగా సవాల్. అయితే అది ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
*తడోబా ఫారెస్ట్, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ లో గణనీయమైన పులులు ఉన్నాయి. ఇక్కడి పులులు అత్యంత క్రూరమైనవి.. గంభీరమైన చూపుతో ప్రత్యర్థి జంతువును ఇట్టే పసిగట్టగలవు. దారుణంగా వేటాడగలవు.
*పెంచ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
రుడ్ యార్డ్ క్లిప్పింగ్ రాసిన జంగిల్ బుక్ పుస్తకానికి ఈ అడవి ప్రేరణ. ప్రసిద్ధమైన పులులు ఈ అడవిలో ఆవాసం ఉంటాయి. కాలర్ వాలి అనే పులి ఈ అడవిలోనే పుట్టింది. అది తన జీవితకాలంలో 29 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అడవిలో 53 కంటే ఎక్కువ పులులు ఉన్నాయి. చిరుతపులులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి.
*పిలిజిబిత్ టైగర్ రిజర్వ్, ఉత్తర ప్రదేశ్
ఉత్తరప్రదేశ్లోని ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతం విశేషమైన ప్రాచుర్యం పొందింది. పులులతోపాటు చిరుత పులి, 250 రకాల పక్షి జాతులు, పలు రకాల సరిసృపాలు ఈ అడవిలో ఉన్నాయి.
*కన్హా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
ఈ పార్కులో రెట్టింపు సంఖ్యలో పులులు ఉన్నాయి.. ఈ ప్రాంతంలో జింకలు విస్తారంగా ఉంటాయి కాబట్టి.. పులుల సంచారం అధికంగా ఉంటుంది. నక్కలు, పందులు, హైనాలు, జింకలు, వివిధ రకాలైన పక్షులకు ఈ అడవి ఆలవాలం.
*బాంధవ్ నగర్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్
ఈ పార్కులో విస్తారమైన చారలు ఉన్న పులులు కనిపిస్తాయి. ఈ పార్క్ దట్టమైన వృక్షాలతో నిండి ఉంటుంది. పులులతో పాటు నీటి ఏనుగులు ఈ అడవిలో ప్రత్యేకంగా కనిపిస్తాయి.
*రణ తంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్
మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉద్యానవనాలలో రణతంబోర్ నేషనల్ పార్క్ ఒకటి. ఈ ప్రాంతంలో దాదాపు 81 వరకు పులులు ఉన్నాయి. ఈ అడవిలో మచ్లీ అనే పేరుతో పులిని ప్రపంచంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు ఎక్కువగా ఫోటోలు తీసిన రికార్డు ఉంది.
-కార్బెట్ టైగర్ రిజర్వు, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో విస్తారంగా పులులు ఉంటాయి. 1936లో ఈ అడవిని జాతీయం చేశారు. ఒక అంచనా ప్రకారం ఈ అడవిలో 260 కి పైగా పులులు ఉన్నాయట.