https://oktelugu.com/

Bachchan Pandey: ‘ఆర్ఆర్ఆర్’కి ‘బచ్చన్‌ పాండే’ దెబ్బ.. రాజమౌళి ఇప్పుడేం చేస్తాడో ?

Bachchan Pandey: గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొత్తానికి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడానికి సిద్ధం అయింది. ‘దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడి, ఫుల్‌ కెపాసిటీతో థియేటర్లు అందుబాటులో ఉంటే.. మార్చి 18న, లేదంటే ఏప్రిల్‌ 28న మా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అంటూ చిత్ర బృందం నిన్న రాత్రి రిలీజ్ చేసిన […]

Written By:
  • Shiva
  • , Updated On : January 22, 2022 / 11:03 AM IST
    Follow us on

    Bachchan Pandey: గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొత్తానికి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడానికి సిద్ధం అయింది. ‘దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడి, ఫుల్‌ కెపాసిటీతో థియేటర్లు అందుబాటులో ఉంటే.. మార్చి 18న, లేదంటే ఏప్రిల్‌ 28న మా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అంటూ చిత్ర బృందం నిన్న రాత్రి రిలీజ్ చేసిన పోస్టర్‌ లో క్లారిటీ ఇచ్చింది.
    .

    పైగా ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య, KGF2, బీస్ట్‌ వంటి బడా సినిమాలు కూడా ఈ రెండు నేలలను టార్గెట్ చేశాయి. మరి ఈ రెండు నెలలు కిక్కిరిసి ఉండగా మరో బాలీవుడ్‌ మూవీ పోటీకి వస్తోంది. మంచి మాస్‌ మసాలా మూవీస్‌ చేయడంలో అక్షయ్‌ కుమార్‌ ది ప్రత్యేక శైలి. అక్షయ్‌ నటించిన బచ్చన్‌ పాండే మార్చి 18న వస్తున్నట్టు పోస్టర్‌ విడుదల చేశారు. పోస్టర్‌ చూస్తోంటేనే మంచి మాస్‌ ఫీస్ట్‌ ఖాయం అన్నట్టుంది. మరి కత్తులు కటార్లతో వస్తున్న ‘బచ్చన్‌ పాండే’ ‘ఆర్ఆర్ఆర్’కి పెద్ద దెబ్బ కొట్టేలా ఉంది.

    Also Read: బోల్డ్ లుక్ లేదన్నారు.. కట్ చేస్తే వరుసగా బోల్డ్ సీన్సే చేస్తోంది !

    మరి ఇప్పుడు రాజమౌళి ఏమి చేస్తాడో చూడాలి. నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న జక్కన్న, తన సినిమాకు సోలో రిలీజ్ డేట్ కావాలని కోరుకుంటాడు. కానీ, కరోనా థర్డ్‌ వేవ్‌ తో వాయిదా పడిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సోలో రిలీజ్ డేట్ ను కోల్పోయింది. మరి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా.. పోటీని ఏ స్థాయిలో రిసీవ్ చేసుకోవాలో చూడాలి.

    RRR Record

    ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో నెటిజన్ల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతుంది ఈ ప్యాన్‌ ఇండియా మూవీ.

    కాగా ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Also Read: దీపికా మరీ ఇంత పచ్చిగా నటించింది ఏమిటి ?

    Tags