
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా తగ్గడం లేదు. రోజురోజుకు ఆయన ప్రతిష్ట మరింత పెరుగుతోంది. మార్నింగ్ కన్సల్డ్ చేసిన ఓ సర్వేలో ఈ విషయం తెలిసింది. ఈ విషయం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తన కూ యాప్ లో ప్రకటించారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోడీ ముందు వరసలో నిలిచారు. మోడీ ప్రతిష్ట ప్రపంచంలోని నేతల్లో కూడా ప్రముఖంగా ఉండటం గమనార్హం.
70 శాతం మంది ఆమోదంతో ప్రధాని మోడీ(Narendra Modi) టాప్ లో నిలిచారు. తర్వాత స్థానాల్లో మిగతా దేశాల నేతలు ఉన్నారు. ఈ జాబితాలో ఆస్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, కెనడా ప్రధాని ట్రూడో, యూకే పీఎం బోరిస్ జాన్సన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ బైర్ బోల్సోనారో ఉన్నారు. 70 శాతం ఆమోదం పొందిన నేతగా ప్రపంచంలోనే అత్యధికంగా అభిమానించే నేతగా ప్రధాని నరేంద్ర మోడీకి చోటు దక్కడం తెలిసిందే.
ప్రపంచంలోని 13 మంది ప్రపంచ నేతలకంటే ముందు ప్రధాని ఉన్నట్లు తెలుస్తోంది. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్, ఇటాలియన్ ప్రధాని మారియో డ్రాగి, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రధాని మోడీ ముందు వరసలో ఉన్నారు.
ప్రతి దేశంలో కొంతమందితో ఇంటర్వ్యూ ఆధారంగా మార్నింగ్ కన్సల్డ్ ఈ రేటింగి ఇస్తుంది. ఈ సంస్థ భారతదేశంలో 2126 మందిని ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ చేసింది. అమెరికన్ డేటా ఇంటలినెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్డ్ ఆస్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, యునైటెడ్ కింగ్ డమ్, యునైటెడ్ స్టేట్స్ లోని నాయకులకు రేటింగ్ ఇచ్చింది.
దీంతో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాతో ఆయనకు సాటి లేదని తెలుస్తోంది. ఏ సర్వే అయినా ఆయనే మొదటి స్థానం అలంకరించడం పరిపాటే. ఈ నేపథ్యంలో మోడీని మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: ఉప ఎన్నికల్లో ఇచ్చిన షాక్ తోనే బీజేపీ తేరుకుందా?
బీజేపీ సంచలన ప్రకటన : 2024లోనూ మోడీనే ప్రధాని.. వర్కవుట్ అవుతుందా?