Actor Nara Rohit: చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన విమర్శలతో పెద్ద వివాదమే చోటుచేసుకుంటోంది. సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలకాలని సూచిస్తున్నారు. రాజకీయాలు హుందాగా ఉండాలి కానీ వివాదాస్పదంగా ఉండకూడదు. అందరు రాజకీయాలు చేసినా ఇంత దారుణమైన పరిస్థితులు ఏనాడు చోటుచేసుకోలేదు. కానీ ఇటీవల రాజకీయాలంటేనే అందరికి హేళన పుడుతోంది.
Also Read: ఈసారి చంద్రబాబు ‘సింపతి’ వర్కౌట్ అవుతుందా..?

దీనిపై సినీనటుడు, చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ కూడా స్పందించారు. వైసీపీ నేతల తీరును తప్పుపట్టారు. పెద్దమ్మ భువనేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. రాజకీయాల్లో ఇంత దారుణమైన పరిస్థితి ఏనాడు చూడలేదని చెబుతున్నారు. వైసీపీ నేతల తెలిపి ఏపాటిదో అర్థమవుతోందని దుయ్యబట్టారు. వైసీపీ నేతల తీరుకు నిరసనగా చంద్రబాబు తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, కర్జూరనాయుడు సమాధుల వద్ద నిరసన తెలిపారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అధికారమే పరమ వేదంగా భావిస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. లక్ష్యం చేరే గమనంలో తమ నైతికతను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. ఎదుటి వారిపై ఎంత పడితే అంత విరుచుకుపడుతూ తమకే నోరు ఉందని చెప్పేందుకు తాపత్రయ పడుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో పెరుగుతున్న రాజకీయ దుమారాలు కనిపిస్తూనే ఉన్నాయి.
చంద్రబాబు అసెంబ్లీలోనే కంట నీరు పెట్టుకుని తనలోని బాధను వ్యక్తం చేయడంతో అందరిలో ఆగ్రహం పెరిగింది. ప్రతిపక్ష నేతను ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ అందరిలో కోపం పెల్లుబికింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల నోరు అదుపులో పెట్టుకోవాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో తన కోపమే తన శత్రువు అనే విధంగా వైసీపీ నేతలు భారీ మూల్యం చెల్లిస్తారనే టీడీపీ నేతలు సూచిస్తున్నారు.
Also Read: చంద్రబాబు.. నాడు ఏడిపించాడు.. నేడు ఏడ్చాడు