
ఈ పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక కార్తికేయ పెళ్లి కావడంతో… ఆయన బంధువులతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ తరుణంలోనే ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి కూడా అజరు కావడం గమనార్హం. స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన చిరంజీవి… నూతన వధువరులను ఆశీర్వ దించారు. అయితే ఈ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నటులు తనికెళ్ల భరణి, సాయి కుమార్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతితో పాటు కొంతమంది సినిమా ప్రముఖులు, యువ హీరోలు సైతం కార్తికేయ పెళ్లికి అటెండ్ అయ్యారు. కార్తికేయ ఇటీవలె రాజా విక్రమార్క సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీచిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించగా… తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది.