Nara Lokesh : ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాల ముఖ చిత్రం గత నాలుగు రోజుల్లో ఏ స్థాయిలో మారిపోయిందో మన అందరికి తెలిసిందే..పవన్ కళ్యాణ్ చేపట్టిన ఉత్తరాంధ్ర పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది..విశాఖ విమానాశ్రయం లో మంత్రుల మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారనే నెపంతో ప్రభుత్వం జనసేన పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి జైలు లోకి నెత్తిన ఘటన పెద్ద దుమారమే రేపింది.

పవన్ కళ్యాణ్ ని కూడా పోలీసులు విశాఖ లోని హోటల్ నోవొటెల్ లో నిర్బంధించి ఆరోజు జరగాల్సిన జనవాణి కార్యక్రమం ని ఆపివేశారు..దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది..ప్రతిపక్షాలు సైతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి మద్దత్తు తెలుపుతూ ప్రభుత్వం మరియు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు తీరుపై విరుచుకుపడ్డారు..ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కి ఫోను లో సంఘీభావం వ్యక్తపరచడమే కాకుండా..విజయవాడ లో హోటల్ నోవొటెల్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిసి తన సంఘీభావం ని వ్యక్తపరిచారు.
సుమారు గంటకి పైగా సాగిన వీళ్లిద్దరి చర్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..అయితే ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో పవన్ కళ్యాణ్ తో పాటుగా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు..ఈ మీడియా సమావేశం లో కేవలం పవన్ కళ్యాణ్ పై జనసేన నాయకుల పై ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించే మాట్లాడుకున్నారని..పొత్తుల గురించి రాజకీయ వ్యూహాల గురించి ఏమి మాట్లాడాడలేదని చంద్ర బాబు నాయుడు చెప్పుకొచ్చారు..పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు..కానీ ఈరోజు చంద్ర బాబు గారి తనయుడు నారా లోకేష్ జనసేన పార్టీ తో పొత్తు గురించి చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటె టీడీపీ – జనసేన కలిసి పనిచెయ్యబబోతున్నాయి అనేది దాదాపుగా ఖరారు అయినట్టే అని తెలుస్తుంది.

ఆయన మాట్లాడుతూ ‘ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం..ప్రతిపక్షాల హక్కుల పోరాటం కోసం టీడీపీ-జనసేన కలిసి పనిచెయ్యబోతున్నాయి..కానీ మా అంతిమ పొత్తు మాత్రం జనం తోనే’ అని చెప్పుకొచ్చారు..రాష్ట్రం లో వైసీపీ అరాచకపాలన కొనసాగుతుందని..తాడేపల్లి ని గంజాయి కి అడ్డాగా మారిపోయింది అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారింది.