Allu Arvind- Chiranjeevi: అల్లు రామలింగయ్య గారి కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్, ఆయనలాగే నటుడిగా కాకుండా నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టి, గీత ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా అల్లు అరవింద్ అధిరోహించిన శిఖరాలు మామూలువి కాదు..నేడు టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలు ఎవరు అంటే మన అందరకి టక్కున గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు అల్లు అరవింద్.

ఈయన ప్రొడక్షన్ హౌస్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే అది కచ్చితంగా సూపర్ హిట్ అనే వైబ్రేషన్ తోనే విడుదల అవుతుంది..అల్లు అరవింద్ కి ఉన్న బ్రాండ్ ఇమేజి అలాంటిది..అయితే ఎప్పుడు కూడా ఇంటర్వూస్ ఇవ్వడానికి పెద్దగా ఇష్టపడని అల్లు అరవింద్ ఈమధ్య కాలం లో అలీ తో సరదాగా అనే ప్రోగ్రాంకి హాజరైన సంగతి మన అందరికి తెలిసిందే..రెండు విడతలుగా తెరకెక్కిన ఈ ఎపిసోడ్ రెండవ భాగం ఈ సోమవారం ప్రసారం అయ్యింది..ఈ ఎపిసోడ్ లో అల్లు అరవింద్ తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
అల్లు అరవింద్ కాలేజీ రోజుల్లో గొడవల్లోకి బాగా దిగేవారట..వాళ్ళ క్లాస్ ఈయన ఒక బ్యాచ్ కి గ్యాంగ్ లీడర్ అట..ఒక రోజు కాలేజీ కి వెళ్తున్న సమయం లో బస్సు కండక్టర్ తో అల్లు అరవింద్ కి గొడవ జరిగిందట..ఆ గొడవలో కండక్టర్ ని మరియు బస్సు డ్రైవర్ ని బలవంతంగా బయటికి నెట్టేసి..ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాడట..ఆ మార్గం మధ్యలోనే పోలీసులు ఆపి అల్లు అరవింద్ ని అరెస్ట్ చేశారట..అలాంటి సందర్భాలు కాలేజీ రోజుల్లో చాలానే జరిగాయట..అల్లు అరవింద్ జైలుకి వెళ్లిందా ప్రతిసారి అల్లు రామలింగయ్య గారు బైల్స్ కోసం కోర్టు చుట్టూ తిరిగేవాడట..ఇదంతా పక్కన పెడితే అల్లు అరవింద్ కి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో అనేదానికి ఒక ఉదాహరణ చెప్పాడు.

అప్పట్లో చిరంజీవి పక్కన ఉంటూనే, చిరంజీవి డేట్స్ ని సర్దుబాటు చేసే మేనేజర్ , ఒక చోట చిరంజీవి గురించి అనుచితంగా మాట్లాడేసరికి అల్లు అరవింద్ కి కోపం కట్టలు తెంచుకుందట..అప్పుడు అతనిని చితకబాదేశాట..అల్లు అరవింద్ గారి దెబ్బలకు అతనికి 13 కుట్లు కూడా పడ్డాయట..చిరంజీవి గారిని ఎవరైనా ఏదైనా అంటే నాకు తెలియకుండానే కట్టలు తెంచుకుని కోపం వచ్చేస్తుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్..ఎప్పుడు తెలివితోనే ప్రత్యర్థులను కొట్టాలని చూసే అల్లు అరవింద్ లో కూడా ఇంత కోపం ఉందా అని ఈ ఎపిసోడ్ ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.