Nara Lokesh’s Letter To Jagan: రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అన్ని దేశాలపై ప్రభావం పడింది. అక్కడ వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వారిని చదివించేందుకు ముందుకొచ్చింది. వారి విద్య కోసం అయ్యే ఖర్చు తామే భరిస్తామని చెబుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థుల భవితవ్యంపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించాలని సీఎం జగన్ కు లేఖ రాశారు.
ఉక్రెయిన్ వెళ్లి తిరిగొచ్చిన విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్ కోసం వారికయ్యే ఖర్చును భరించి వారిని చదువుకునేలా చూడాలని కోరారు. దీంతో లోకేష్ రాసిన లేఖతో జగన్ పై మరో పిడుగు పడినట్లు అయింది. అసలే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతున్న సందర్భంలో ఇప్పుడు విద్యార్థులను చదివించాలంటే మాటలు కాదు. రూ. కోట్లు ఖర్చవుతాయని జగన్ ఆలోచనలో పడిపోతున్నారు.
Also Read: Wine Shops Closed In Hyderabad: మందు బాబులకు షాక్.. రెండు రోజులు వైన్స్ బంద్
పొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు విద్యార్థులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్న సందర్భంలో ఏపీ కూడా విద్యార్థుల కోర్సులు పూర్తయ్యేందుకు ముందుకు రావాల్సిన అవసరముంది. విద్యార్థుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వారి చదువు పూర్తయ్యేలా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన 740 మంది విద్యార్థులు వచ్చారని తెలుస్తోంది. వారి విద్య కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
మనదేశంలో రూ. కోటి వరకు ఖర్చయ్యే వైద్య విద్య కోసం ఉక్రెయిన్ లో అయితే రూ.25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు కావడంతో విద్యార్థులు అక్కడకు వెళ్లడం తెలిసిందే. కానీ అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు అక్కడకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దీంతో కోర్సు పూర్తి కాక తిరిగి వచ్చిన వారి సమస్యను ప్రభుత్వమే చొరవ చూపి వారికి సాయం చేయాల్సిన అవసరం గుర్తించాలని లోకేష్ లేఖలో కోరడం తెలిసిందే.
Also Read: BJP Social Media Controversy: సరికొత్త వివాదం: బీజేపీకి ఫేస్ బుక్ మిత్రపక్షమా?