మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మరోమారు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా అధికార పార్టీపై విరుచుకుపడే లోకేశ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధ పడుతున్నారంటూ లోకేశ్ కామెంట్లు చేశారు. జగన్ బాధ పడుతున్న వ్యాధి యొక్క ప్రధాన లక్షణం విధ్వంసం అని ఘాటుగా విమర్శలు చేశారు.
మాజీ ఎంపీ సబ్బం హరి అక్రమంగా నిర్మించుకున్న టాయిలెట్ ను అధికారులు కూల్చేయడంతో లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా సబ్బంహరి ఇంటిని కూల్చాలని ప్రభుత్వం పథకం రచించిందని చెప్పారు. జగన్ సర్కార్ విధివిధానాలపై విమర్శలు చేస్తుండటం వల్లే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని అన్నారు. జగన్ సబ్బంహరిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.
సబ్బంహరి ఉన్నతవిలువలతో రాజకీయాలు చేశారని అలాంటి వ్యక్తిని జగన్ సర్కార్ ఇబ్బందులు పెడుతోందని అన్నారు. జగన్ తనలోని సైకో మనస్తత్వాన్ని ఇలాంటి ఘటనల ద్వారా ప్రజలకు పరిచయం చేస్తున్నాడని అన్నారు. విమర్శిస్తే కూల్చేస్తూ, ప్రశ్నిస్తే చంపేస్తూ విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ నియంతలా పాలన సాగిస్తున్నారని.. ప్రజల్లో జగన్ పాలనపై ఆగ్రహం పెరుగుతోందని అన్నారు.
మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసి టాయిలెట్ నిర్మించుకోవడంతో పాటు మరి కొంత స్థలాన్ని ఇంటి స్థలంలో కలిపేసుకున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది. అధికారులు గతంలోనే సబ్బంహరికి నోటీసులు జారీ చేసి నిర్మాణాన్ని తొలగించాలని కోరారు. సబ్బంహరి నోటీసులకు స్పందించకపోవడంతో అక్రమ నిర్మాణాన్ని జేసీబీతో కూల్చివేశారు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Nara lokesh says that jagan is suffering from that disease
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com