https://oktelugu.com/

చినబాబుకు బ్యాడ్ లక్.. అవకాశం మిస్సయిందా?

ఏపీలో త్వరలోనే ఉప ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజుతోపాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీల ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన అనర్హత వేయాలని కోరినట్లు తెలుస్తోంది. అదేవిధంగా టీడీపీలో గెలిచి వైపీసీకి మద్దతు ప్రకటిస్తున్న వంశీపై ఆపార్టీ ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 17, 2020 8:44 pm
    Follow us on


    ఏపీలో త్వరలోనే ఉప ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజుతోపాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీల ఇష్యూ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన అనర్హత వేయాలని కోరినట్లు తెలుస్తోంది. అదేవిధంగా టీడీపీలో గెలిచి వైపీసీకి మద్దతు ప్రకటిస్తున్న వంశీపై ఆపార్టీ ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది.

    చిన్నచిన్న తప్పులకు అరెస్టులు చేయకూడదా ఉమా?

    గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వంశీతోపాటు మరో ఇద్దరు టీడీపీ నేతలు కూడా వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తేనే జగన్ తన పార్టీలోకి తీసుకుంటానని గతంలో ప్రకటించాడు. దీంతో జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి వైసీపీ తరఫున పోటీచేసేందుకు వంశీ రెడీ అవుతున్నారు. అయితే గన్నవరంలో టీడీపీ సపోర్టుతో గెలిచిన వంశీ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేస్తే తగిన గుణపాఠం చెబుతామని తెలుగు తమ్ముళ్లు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ఉప ఎన్నికల్లో వంశీ గెలుపు అంత ఈజీ కాదనే టాక్ విన్పిస్తుంది.

    ఉప ఎన్నికలకు వైసీపీ సర్కార్ వెళితే అభ్యర్థుల గెలుపోటములు జగన్ పాలనకు రెఫరెండంగా మారనున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఆచితూచి ముందుకెళుతోంది. టీడీపీకి ఈ ఎన్నికల్లో ఎక్కడా ఛాన్స్ ఇవ్వద్దనే వైసీపీ నేతలు భావిస్తున్నారు. గన్నవరంలో టీడీపీ ఇప్పటికే బలంగానే ఉంది. వంశీతోపాటు టీడీపీ క్యాడర్ పెద్దగా వెళ్లకపోవడం ఆపార్టీకి కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గన్నవరంలో బలమైన అభ్యర్థిని నిలబడితే టీడీపీ గెలుస్తుందనే ఆశాభావాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్ బాబు పేరు తెరపైకి వచ్చింది.

    మాస్కులు పెట్టుకోలేదని కోటి ఫైన్..!

    గన్నవరంలో టీడీపీ తరఫున లోకేష్ బాబు పోటీచేసి తన సత్తా ఏంటో చూపించాలని ఉవ్విళ్లురుతున్నారనే టాక్ స్థానికంగా విన్పిస్తుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో సర్పంచ్ గా లోకేష్ బాబు గెలువలేడని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యేగా గెలిచి ధీటైనా జవాబు ఇవ్వాలని అనుకుంటున్నారట. లోకేష్ బాబు పోటీచేస్తే గెలుపు తమదేనంటూ తెలుగు తమ్ముళ్లు హడవుడి మొదలెట్టినట్లు తెలుస్తోంది.

    అయితే వంశీ సైతం తన కష్టార్జితంతోనే ఎమ్మెల్యేగా గెలిచానని ఇందులో టీడీపీ పాత్ర తక్కువని, ఇక చంద్రబాబు పాత్ర ఏమిలేదని ఆఫ్ ది రికార్డు చెబుతున్నాడట. ఇప్పటికే తనను టీడీపీ సస్పెండ్ చేసిందని ఇక రాజీనామా చేసిన చేయకున్నా ఒకటేనంటూ చెబుతున్నాడట. వంశీ రాజీనామాతో పోటీచేసి తన సత్తా చూపించాలకున్న లోకేష్ బాబుకు ప్రస్తుతానికి అవకాశం లేకుండా పోయిందట. దీంతో ప్చ్.. లోకేష్ బాబు మంచి ఛాన్స్ మిస్సయిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటుండటం గమనార్హం.