భారత్ లో డేటాను ఏ సమస్యా లేకుండా సేకరించవచ్చు. గూగుల్’ ఫేస్‌బుక్, అమెజాన్, ట్విట్టర్ లాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలు భారత్ వైపు చూడడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం. అయితే ఇక్కడ డేటా కూడా దొరుకుతుంది కాబట్టి ఈ కంపెనీలు భారత్ లోకి రావాలనే అనుకుంటాయి. డేటా ప్రొఫైలింగ్ వల్ల కంపెనీల దగ్గర ఒక పెద్ద స్టోరేజ్ ఉంటుంది. దానిని బట్టి వాటికి వినియోగదారుల అలవాట్ల గురించి తెలిసిపోతుంది. మార్కెట్ రీసెర్చ్ కూడా చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కానీ, ప్రజల్లో ఈ డేటాను ఎవరైనా దుర్వినియోగం చేస్తారేమో అనే ఆందోళన కూడా ఉంది. ఇక్కడ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఈ పనుల పురోగతికి తగినట్లు డేటాపై నిఘా పెట్టడం, దానిని సురక్షితంగా ఉంచడం, దానిపై గుత్తాధిపత్యాన్ని నిరోధించడం కోసం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు
“ఒక ప్రక్రియ అంటూ లేనపుడు, దానిని మనం అమోదించడం లేదా నిరాకరించడం ఎలా చేయగలం. దానిపై పని జరుగుతోంది. కానీ అది చాలా మెల్లగా జరుగుతోంది. ఈ క్రమంలో డేటా ఎక్కడ, ఎలా ఉంచాలి అనే దానిపై రాబోయే రోజుల్లో రిలయన్స్-జియో, గూగుల్-ఫేస్‌బుక్-అమెజాన్ లాంటి కంపెనీలతో వివాదాలు తలెత్తవచ్చని కొందరు చెబుతున్నారు.
గోప్యతను కాపాడే పేరుతో ముందు ముందు మార్కెట్ లో ఆంక్షలు ఉండకూడదు. దానిని దృష్టిలో పెట్టుకునే కంపెనీలు బహుశా.. మేం ఈ డేటాను ప్రకటనలకు మాత్రమే ఉపయోగిస్తామని, వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోమని చెబుతున్నయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.