Mega Family: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తమ వైపుకు తిప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైసీపీ, జనసేన పార్టీల మధ్య తలెత్తిన వివాదం పెద్ద దుమారం రేగుతోంది. రాష్ర్ట రాజకీయాల్లో వస్తున్న మార్పులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను తమ వైపుకు తిప్పుకోవాలని లోకేష్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పవన్ కల్యాణ్ కు ఎల్లో మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇది నిజమేనని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ అభిమానులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో లోకేష్ పలు విధాలుగా ట్వీట్లు చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పవన్ కల్యాణ్ ను టీడీపీ వైపు తిప్పుకునే క్రమంలో లోకేష్ పలు మార్గాలు అన్వేషిస్తున్నారు.
ఇక రిపబ్లిక్ సినిమా వేడుకలో మొదలైన మాటల యుద్ధం ఆరడం లేదు. ప్రస్తుతం నారా లోకేష్ హీరో సాయిధరమ్ తేజ ఆరోగ్యంపై ట్వీట్లు పెడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశించడం గమనార్హం. సాయిధరమ్ తేజ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజ్ గురించి లోకేష్ ట్వీట్ చేయడం సంచలనంగా మారుతోంది.
సాయిధరమ్ తేజ ప్రమాదానికి గురై ఇన్ని రోజులైనా ఇప్పుడు లోకేష్ స్పందించడంలో ఏదో అంతరార్థం దాగి ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇదంతా పక్కా రాజకీయమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పవర్ స్టార్ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.