Nara Lokesh vs Sakshi Reporter : ఇదే ప్రశ్న జగన్ భార్యను అడుగుతావా? సాక్షి రిపోర్టర్ పై ఫైర్ అయిన లోకేష్.. వైరల్ వీడియో

ప్రెస్ మీట్ హాజరైన సాక్షి ప్రతినిధి లోకేష్ ను టార్గెట్ చేస్తూ ప్రశ్నల వర్షాన్ని కురిపించాలని చూశారు. ముందుగా హెరిటేజ్ గురించి ప్రశ్నించారు. దీంతో లోకేష్ వీర లెవెల్లో విరుచుకుపడ్డారు

Written By: Dharma, Updated On : October 12, 2023 10:27 am
Follow us on

Nara Lokesh vs Sakshi Reporter : సాధారణంగా నారా లోకేష్ ను మీడియా ఓ రేంజ్ లో వేసుకుంటుంది. అతడి నోటి నుంచి తప్పులు దొర్లితే ఆడిపోసుకుంటుంది. ముఖ్యంగా సాక్షి మీడియాకు అదే పని. లోకేష్ ఎక్కడ తప్పుగా మాట్లాడతాడా? ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటిది లోకేషే తిరిగి సాక్షి మీడియాను ఓ రేంజ్ లో వాయించేశారు. గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో గత రెండు రోజులుగా లోకేష్ ను సిఐడి విచారించిన సంగతి తెలిసిందే. రెండో రోజు బుధవారం విచారణ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధి వేసిన ప్రశ్నకు ఆయన ఓపిగ్గానే కౌంటర్ ఇచ్చారు. ఏంటమ్మా.. చెప్పమ్మా సాక్షి.. ఏమో సాక్షి కదా.. నీకు జీతం ఎక్కువగా కడుతున్నారట కదా, మీకు జీతాలు పెరిగాయా లేదా చెప్పు అని ప్రశ్నించారు.

ప్రెస్ మీట్ హాజరైన సాక్షి ప్రతినిధి లోకేష్ ను టార్గెట్ చేస్తూ ప్రశ్నల వర్షాన్ని కురిపించాలని చూశారు. ముందుగా హెరిటేజ్ గురించి ప్రశ్నించారు. దీంతో లోకేష్ వీర లెవెల్లో విరుచుకుపడ్డారు. బ్రదర్ అలా అనవద్దు, అనవసర ఆరోపణలు చేయవద్దు అంటూ సాక్షి ప్రతినిధులు ఉద్దేశించి అన్నారు. హెరిటేజ్ సంస్థ 1992లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రారంభమైంది అన్న విషయాన్ని గుర్తు చేశారు. 1990 లోనే లిస్టింగ్ అయిందని.. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయని తేల్చి చెప్పారు.

సాక్షి మీడియాను లోకేష్ టార్గెట్ చేసుకున్నారు. పది రూపాయల షేర్ ను దొడ్డిదారిన 350 రూపాయలు చేయలేదని సాక్షి మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని.. దమ్ము, ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవసరమైతే వెళ్లి భారత రెడ్డిని అడుగు అని చురకలాంటించారు. ప్రజాధనాన్ని లూటీ చేసి సాక్షి ఛానల్ అందరికంటే ఎక్కువ రేటింగ్ వేయించుకుంటుందని మండిపడ్డారు. సాక్షి పేపర్ కొనాలని ఒలంటీర్ కి జీవో జారీ చేసిన ఘనత మీదేనని చెప్పుకొచ్చారు. అందుకే ఢిల్లీ హైకోర్టు జగన్ తో పాటు భారతీ రెడ్డికి నోటీసులు ఇవ్వడం మీకు తెలియదా అని ప్రశ్నించారు. మొత్తానికైతే లోకేష్ సాక్షి మీడియా ప్రతినిధి పై వీర లెవెల్ లో విరుచుకు పడడం విశేషం. దీనినే ఇప్పుడు టిడిపి సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.