Minister Roja: రోజాకి మద్దతు గా తమిళ్ హీరోయిన్స్ మాత్రమే మాట్లాడటం వెనక సెల్వమని డైరెక్షన్ ఉందా..?

మధ్యలో చిరంజీవి ప్రజారాజ్యం పేరు తో పార్టీ ని పెట్టీ పాలిటిక్స్ లోకి వచ్చినప్పటికీ ఆయన ఓడిపోయి పాలిటిక్స్ లో నిలువ లేక పోయారు దాంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ ఉంటున్నారు.

Written By: Gopi, Updated On : October 12, 2023 11:31 am

Minister Roja

Follow us on

Minister Roja: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పాలిటిక్స్ లో వచ్చి ఇక్కడ కూడా రాణిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ముందుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం అనే పార్టీని పెట్టడం జరిగింది. ఈ పార్టీని పెట్టిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉన్న చాలా మంది ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈ పార్టీని ఆయన స్థాపించిన 9 నెలల్లోనే సీఎంగా అధికారంలోకి వచ్చి సిఎం అయి ఆంధ్రప్రదేశ్ జనానికి తన వంతు సేవ చేశారు. అప్పటినుంచి సినిమా వాళ్ళందరూ పాలిటిక్స్ లోకి రావడం స్టార్ట్ చేశారు.

మధ్యలో చిరంజీవి ప్రజారాజ్యం పేరు తో పార్టీ ని పెట్టీ పాలిటిక్స్ లోకి వచ్చినప్పటికీ ఆయన ఓడిపోయి పాలిటిక్స్ లో నిలువ లేక పోయారు దాంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ ఉంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పిలవబడుతు అందర్నీ వాడు, వీడు అంటూ సంబోధిస్తూ ఆడవాళ్ళు అయితే అది ఇది అంటూ మాట్లాడుతూ ఎప్పుడు ప్రెస్ మీట్ లు పెడుతూ ఎవరినో ఒక్కరిని తిడుతూ ఉండే రోజా మాటల మీద స్పందించిన బండారు సత్యనారాయణ టిడిపి పార్టీ లీడర్ గా ఉన్న ఈయన ఆమె మీద వల్గర్ గా మాట్లాడే మాటల మీద చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. అందులో భాగంగానే రోజా ఒకప్పుడు చాలా అసభ్యకరమైన పనులను కూడా చేసింది అంటూ రోజా మీద విరుచుకు పడుతూ మాట్లాడడంతో గత కొద్ది రోజుల నుంచి ఇదే రచ్చ నడుస్తుంది.

అయితే ఆయనకి కౌంటర్ గా రోజా ఏడుస్తూ అమ్మాయి అని కూడా చూడకుండా ఇలా మాట్లాడతారా అంటూ కన్నీరు పెట్టుకుంటు మాట్లాడుతూ రోజా ఒక వీడియో పెట్టింది. ఇది చూసిన చాలామంది నువ్వు వేరే వాళ్ళ ఫ్యామిలీ ని తిట్టినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అంటూ చాలామంది నెటిజన్లు ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.ఇక ఇలాంటి సమయంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒకప్పటి హీరోయిన్లు అయినా రాధిక,మీనా, కుష్బూ లాంటివారు రోజా కి సపోర్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి రోజాకి ఏ ఒక్క హీరో గాని, హీరోయిన్ గాని ఒక మాట కూడా తనకి సపోర్టుగా మాట్లాడటం లేదు.

తమిళ్ ఇండస్ట్రీ నుంచి మాత్రమే మాట్లాడుతున్నారు అంటే అర్థం చేసుకోవాల్సిందేంటి అంటే తమిళ్ ఇండస్ట్రీ నుంచి తన భర్త అయినా ఆర్కే సెల్వమని పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం వాళ్లతో మాట్లాడిస్తున్నారు అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ల చేత మాట్లాడిస్తే రోజాకి జనాల్లో సింపతి పెరుగుతుందని తద్వారా తనకి ఎక్కువ గా పొలిటికల్ మైలేజ్ కూడా వస్తుందని ఒక ప్లాన్ ప్రకారం ఇలా చేస్తున్నారని ఇది చూసిన చాలామంది కామెంట్లు చేస్తున్నారు…