https://oktelugu.com/

Nara Lokesh: నారా లోకేష్ ను వదిలిపెట్టని కరోనా

Nara Lokesh: యువకుడు.. ఉత్సాహ వంతుడు.. ఈ మద్య సన్నబడి డైట్ మెయింటేన్ చేస్తున్న నారా లోకేష్ ను సైతం కరోనా వదిలిపెట్టలేదు. ఈ మధ్య జనాల్లో తిరగకున్నా కూడా లోకేష్ ను కరోనా కాటేసింది. టీడీపీ భవిష్యత్ సారథి ప్రస్తుతం కరోనా బారిన పడి క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. తనకు కరోనా పాజిటివ్ గా వచ్చినట్టు నారా లోకేష్ ప్రకటించాడు. గత మొదటి వేవ్ లో హైదరాబాద్ లో రెస్ట్ తీసుకున్న నారా లోకేష్ అప్పుడు కరోనా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2022 / 05:02 PM IST
    Follow us on

    Nara Lokesh: యువకుడు.. ఉత్సాహ వంతుడు.. ఈ మద్య సన్నబడి డైట్ మెయింటేన్ చేస్తున్న నారా లోకేష్ ను సైతం కరోనా వదిలిపెట్టలేదు. ఈ మధ్య జనాల్లో తిరగకున్నా కూడా లోకేష్ ను కరోనా కాటేసింది. టీడీపీ భవిష్యత్ సారథి ప్రస్తుతం కరోనా బారిన పడి క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు.

    తనకు కరోనా పాజిటివ్ గా వచ్చినట్టు నారా లోకేష్ ప్రకటించాడు. గత మొదటి వేవ్ లో హైదరాబాద్ లో రెస్ట్ తీసుకున్న నారా లోకేష్ అప్పుడు కరోనా బారినపడలేదు. ఆ సమయంలో లావు తగ్గి సన్న జాజి తీగలా మారిపోయాడు. ఇక సెకండ్ వేవ్ వేళ విస్తృతంగా కరోనా వ్యాపించి దేశం అల్లకల్లోలమైనా కూడా లోకేష్ బాబు దాని బారిన పడలేదు. అయితే థర్డ్ వేవ్ లో మాత్రం చిక్కాడు.

    ఇప్పటికే సామాన్య జనంతోపాటు సినీ, రాజకీయ సెలబ్రెటీలు చాలా మంది కరోనా బారినపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు జయించారు. ఏపీలో కరోనా తీవ్రత బాగా పెరుగుతున్న నేపథ్యంలో వరుసగా ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడడం ఆందోళన కలిగిస్తోంది.

    లోకేష్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. కరోనా పాజిటివ్ గా తేలినా కూడా లక్షణాలేవీ లేవని తెలిపాడు. బాగానే ఉన్నానని.. ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు పేర్కొన్నాడు. తనను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాడు. లక్షణాలేవీ లేకుండానే నారా లోకేష్ కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. లోకేష్ త్వరగా కోలుకోవాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి.