https://oktelugu.com/

Bangarraju: బాక్సాఫీస్ : ‘బంగార్రాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !

Bangarraju: ‘బంగార్రాజు’ భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టలేక పోయినా ఓ కోణంలో మంచి కలెక్షన్స్ నే రాబడుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయి నాలుగు రోజులు అవుతున్నా ఇంకా బాగానే కలెక్ట్ చేసింది. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో ‘బంగార్రాజు’ ఏ మాత్రం తగ్గ లేదు. నిజానికి ఈ సినిమా కేవలం బ్రేక్ ఈవెన్ కిందే రిలీజ్ అయింది. సినిమాని ముందే జీ5 కి అమ్మేసుకున్నారు. అందుకే, […]

Written By:
  • Shiva
  • , Updated On : January 17, 2022 / 05:17 PM IST
    Follow us on

    Bangarraju: ‘బంగార్రాజు’ భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టలేక పోయినా ఓ కోణంలో మంచి కలెక్షన్స్ నే రాబడుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయి నాలుగు రోజులు అవుతున్నా ఇంకా బాగానే కలెక్ట్ చేసింది. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో ‘బంగార్రాజు’ ఏ మాత్రం తగ్గ లేదు. నిజానికి ఈ సినిమా కేవలం బ్రేక్ ఈవెన్ కిందే రిలీజ్ అయింది. సినిమాని ముందే జీ5 కి అమ్మేసుకున్నారు. అందుకే, ఫస్ట్ డే నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడుస్తోంది.

    Bangarraju

    ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల వివరాలను ఒకసారి గమనిస్తే :

    నైజాం 6.65 కోట్లు
    సీడెడ్ 5.45 కోట్లు
    ఉత్తరాంధ్ర 2.80 కోట్లు
    ఈస్ట్ 2.55 కోట్లు
    వెస్ట్ 1.87 కోట్లు
    గుంటూరు 2.35 కోట్లు
    కృష్ణా 1.43 కోట్లు
    నెల్లూరు 1.15 కోట్లు

    Also Read:  నారా లోకేష్ ను వదిలిపెట్టని కరోనా

    ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 24.25 కోట్లు

    రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2.75 కోట్లు

    ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 27.00 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

    ‘బంగార్రాజు’ సినిమాకు రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అంటే.. ఈ సినిమా బయర్లకు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కాగా 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.27 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ కు మరో రూ.12 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టాల్సి ఉంది.

    Also Read: ‘రంగమార్తండ’లో బ్రహ్మనందం సరికొత్త రోల్..!

    Tags