https://oktelugu.com/

Indian Army: ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Indian Army:  ప్రపంచ దేశాల్లో ప్రభావవంతమైన సైన్యాలు ఉన్న దేశాలలో మన దేశం కూడా ఒకటి. మన దేశంలో 15 లక్షలకు పైగా సైనికులు ఉన్నారు. ఈ సైనికులు దేశ రక్షణ కొరకు ఎంతగానో కృషి చేస్తున్నారు. త్వరలో దేశంలోని సైనికుల కొరకు కంబాట్ యూనిఫామ్ అందుబాటులోకి రానుంది. ఈ కంబాట్ యూనిఫామ్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కంబాట్ యూనిఫామ్ ను ధరిస్తే ఎలాంటి వాతావరణంలో అయినా ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించవచ్చు. బహిరంగ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 17, 2022 5:02 pm
    Follow us on

    Indian Army:  ప్రపంచ దేశాల్లో ప్రభావవంతమైన సైన్యాలు ఉన్న దేశాలలో మన దేశం కూడా ఒకటి. మన దేశంలో 15 లక్షలకు పైగా సైనికులు ఉన్నారు. ఈ సైనికులు దేశ రక్షణ కొరకు ఎంతగానో కృషి చేస్తున్నారు. త్వరలో దేశంలోని సైనికుల కొరకు కంబాట్ యూనిఫామ్ అందుబాటులోకి రానుంది. ఈ కంబాట్ యూనిఫామ్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కంబాట్ యూనిఫామ్ ను ధరిస్తే ఎలాంటి వాతావరణంలో అయినా ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించవచ్చు.

    బహిరంగ మార్కెట్ లో కంబాట్ యూనిఫామ్ దొరకకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంబాట్ యూనిఫామ్ బహిరంగ మార్కెట్ లో లభ్యమవుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫామ్ విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త కంబాట్ యూనిఫామ్ టీషర్ట్ రూపంలో ఉండగ ఈ యూనిఫామ్ ను ఎవరైతే ధరిస్తారో వాళ్ల ప్యాంటు బెల్ట్ కూడా బయటకు కనిపించే ఛాన్స్ ఉండదు.

    70 శాతం కాటన్‌, 30 శాతం పాలిస్టర్‌ తో తయారైన ఈ యూనిఫామ్ మన్నిక కూడా ఎక్కువ కాలం ఉంటుందని సమాచారం. అతిశీతల, ఉష్ణప్రాంతాల్లో కూడా ఈ యూనిఫామ్ ను ధరించవచ్చు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ డ్రెస్ యొక్క రంగు మారుతుంది. ఈ విధంగా రంగు మారడం వల్ల సైనికులు దక్కున్నా శత్రువులు గుర్తు పట్టే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

    నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ యూనిఫామ్ ను సిద్ధం చేసింది. ఇతర దేశాల యూనిఫామ్ లతో పోలిస్తే మెరుగ్గా ఈ యూనిఫామ్ ఉండటం గమనార్హం. ఈ సైనిక యూనిఫామ్ వల్ల సైనికులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.