Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు అయ్యారు. తెలుగుదేశం పుట్టెడు కష్టాల్లో ఉంది. ఎలాగోలా భువనేశ్వరి, బ్రాహ్మణమ్మ వచ్చారు కానీ సరికొత్త చిక్కు వచ్చి పడింది.తీయని తెలుగు, సుందర తెలుగు లోకేశ్ కు రాదు. బ్రాహ్మణికి రాదు. భువనేశ్వరమ్మకు అంతకన్నా రాదు. వీళ్లంతా అమెరికాలో చదువుకున్న ధనికుల బిడ్డలు. భాష తెలిసిన బాలకృష్ణకు వ్యవహారిక జ్ఞానం రాదు. వీరిని చూస్తున్న తెలుగు తమ్ముళ్లు చేష్టలుడికి చూడాల్సి వస్తుంది. అయినా సరే మద్దతు తెలుపుతున్న తెలుగు తమ్ముళ్లకు హ్యాట్సాఫ్. మీ పోరాట అభినందనీయమే. నాయకత్వ వారసత్వానికి మీరు ఇచ్చే గౌరవం భేష్.
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ పిల్లలకు సార్వభౌమాధి కారం అన్న పదం పలకడం రాకపోవడం విచారకరం. ఆంధ్రుల దురదృష్టం. దౌర్భాగ్యం కూడా ! ఇక భువనమ్మ భాష విన్నారు కదా ! ఆమె తెలుగు కూడా అంతంత మాత్రమే ! బాలకృష్ణకు భాషపై పట్టు ఉన్నా.. ఉచ్ఛరణలో దిట్ట అయినా.. ఆ భాషను బయట పెట్టే టైమింగ్, రైమింగ్ తెలియదు. దీర్ఘవాక్యాలు పలకడంలో ధీరుడే అయినా.. సామాన్యుడికి అర్థమయ్యే సరళత్వం లేక.. ఆయన భాషా పరిజ్ఞానం ఎందుకూ అక్కరకు రాకుండా పోతోంది.
దేనికైనా భాష ముఖ్యం.. భావం అంతకంటే ముఖ్యం. అది తెలిసినవాడే అసలు సిసలు విజ్ఞానవంతుడు. తెలియని వాడికి విజ్ఞానం ఉన్నా అది ఎందుకూ పనికిరానిదే. పోనీ మన సీఎం జగన్కు సుందర భాష తెలుసునా అంటే.. తెలియదు.. తెలుసుకోలేరు కూడా. పేపర్లో రాసినది చదవలేక ఆయన పడే బాధ మనందరికీ తెలిసిన విషయమే. అయితే వీరంతాతెలుగు నేలపై ఉన్నారు.. అదే తమిళ నేలపై ఉంటే ఎటూ అక్కడకు రారు. అక్కడ కచ్చితంగా భాష పై పట్టు ఉండాల్సిందే. కరుణానిధి అయినా.. జయలలిత అయినా.. పళని స్వామి అయినా.. పన్నీరు సెల్వం అయినా.. నేటి స్టాలిన్ అయినా భాష పై మమకారం చూపాల్సిందే. అంతకంటే మించి సుందర తమిళం పలకాల్సిందే. అదే తమిళనాడు.. తెలుగు నేలకు తేడా.