Lokesh Padayatra – Nandamuri Tarakaratna : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాన పార్టీలు ఇప్పటి నుండే ప్రచారం చేయడం ప్రారంభించాయి.. అందులో భాగంగానే తెలుగు దేశం పార్టీ తరుపున నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ‘యువ గళం’ పేరిట పాదయాత్ర ఇటీవలే ప్రారంభించాడు.

లోకేష్ పాదయాత్ర చేపడుతున్న సందర్భంగా తెలుగు దేశం పార్టీ కార్యకర్తల్లో మరియు నాయకుల్లో ఉత్సాహం మొదలైంది..మేము సైతం అంటూ లోకేష్ తో కలిసి పాదయాత్ర చెయ్యడానికి ముందుకు వస్తున్నారు..ఇందులో భాగంగా నారాలోకేష్ నేడు కుప్పం లో పాదయాత్ర ని ప్రారంభించాడు..ఈ పాదయాత్ర లో ఇటీవలే తెలుగు దేశం పార్టీ లో చేరిన నందమూరి తారకరత్న పాల్గొన్నాడు.
కుప్పం ప్రాంతం లోని శ్రీవరదరాజస్వామి ఆలయంలో పాదయాత్ర కి ముందు లోకేష్ తో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న తారక రత్న బయటకి వస్తున్న సమయం లో అక్కడకి వచ్చిన అశేష జనవాహిని తాకిడిని తట్టుకోలేక సొమ్మసిల్లి క్రింద పడిపోయాడు..అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకీ మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు తెలుస్తుంది..వెంటనే ఆయనని కుప్పం ప్రాంత సమీపం లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్స అందించడం తో ఆయన ఆరోగ్యం నిలకడ స్టేజికి వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు.

త్వరలోనే ఆయన ప్రజాక్షేత్రం లో టీడీపీ పార్టీ తరుపున విస్తృతంగా ప్రచారం చెయ్యబోతున్నాడు..ఇక లోకేష్ పాద యాత్ర విషయానికి వస్తే 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర కొనసాగనుందని తెలుస్తుంది..కుప్పం లో ప్రారంభమైన ఆయన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం లో ముగుస్తుంది.