Chandrababu In Unstoppable With NBK: ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా ప్రసారం చేసిన అన్ స్టాపబుల్ సూపర్ సక్సెస్ అయింది. నటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించారు. పార్ట్ 1లో సిని నటులతో బాలయ్య చేసిన సందడికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆహా ఓటీటీకి కూడా మంచి రేటింగ్ వచ్చింది. దీంతో తాజాగా అన్‌స్టాపబుల్ – 2పై ఆహా యాజమాన్యం దృష్టి పెట్టింది. బాలయ్యే హోస్టగా ఈ పార్ట్ – 2ను రెడీ చేస్తోంది. ఈరోజు సాయంత్రం విజయవాడ వేదికగా ఈ షోకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అవుతుంది.

త్వరలో షో..
బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. మంగళవారంæ విజయవాడ వేదికగా ఈ షోకు సంబంధించిన టీజర్ విడుదల చేయనున్నారు. సాయంత్రం ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షోకు సంబంధించి ఇంటస్ట్రింగ్ వార్తలు తెరపైకి వస్తున్నాయి.
ఓటీటీలో హోస్ట్‌గా..
నందమూరి బాలకృష్ణ గత యేడాది ఆహా ఓటీటీ వేదికగా హోస్ట్ అవతారం ఎత్తారు. అంతేకాదు ఓ హోస్ట్‌గా తనదైన శైలిలో అన్ స్టాపబుల్ షోను రక్తి కట్టించారు. మోహన్‌బాబు చిట్‌చాట్‌తో మొదలైన ఈ షో.. మహేష్ బాబుతో ఎండ్ అయింది. ఈ షో కారణంగా ఆహా ఓటీటీకి సబ్‌స్క్రైబర్స్‌కు భారీగా పెరిగారు. ఈ షోలో హోస్ట్‌గా బాలయ్య ఎలా రక్తించడానేది సెపరేట్‌గా చెప్పనవసరం లేదు. ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసి అలరించిన బాలయ్య ముఖ్యంగా తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్‌తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది.
సీజన్ – 2లో పొలిటికల్ లీడర్స్..
వినోదాత్మక కార్యక్రమంలోకి అన్ స్టాపబుల్ – 2లోకి పొలిటికల్ లీడర్స్‌ను తీసుకురావాలని నిర్ణయించింది ఆహా యాజమాన్యం. సెకండ్ సీజన్‌లో ఫస్ట్ గెస్ట్‌గా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తారని సమాచారం. దీనిపై గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే. అయితే చంద్రబాబే మొదటి గెస్ట్‌గా రానున్నారని సమాచారం వస్తోంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ తాలూకా షూట్ జరుగుతుందట. అంతే కాకుండా ఈ ఎపిసోడ్‌లోనే చంద్రబాబుతోపాటు నారా లోకేష్ కూడా కనిపించనున్నారని సమాచారం అందింది. మరి లోకేష్ పై అయితే ఓ స్టన్నింగ్ అండ్ స్పెషల్ ఎంట్రీని కూడా ఈ ఎపిసోడ్ లో డిజైన్ చేశారని తెలుస్తోంది.

ఓటీటీ ప్లాట్‌ఫాంపై గర్జిస్తున్న బాలయ్య..
ఇక బాలయ్య షో విషయానికి వస్తే… అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ కాదు కాదు.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలయ్య సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. స్మాల్ స్క్రీన్ పై కూడా తన హోస్ట్‌తో గర్జించారు. ఇక సెకండ్ సీజన్‌కు సంబంధించిన స్పెషల్ ఏంథెమ్ సాంగ్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 విజయ దశమి కానుకగా స్ట్రీమింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
సాంగ్ రిలీజ్
గత మంగళవారం అన్ స్టాపబుల్ యాంథమ్ అంటూ సాంగ్‌ను ఆహా యాజమాన్యం రిలీజ్ చేసి ఫ్యాన్స్‌లో ఉత్సహాన్ని నింపింది. రోల్ రైడా పాడిన అన్ స్టాపబుల్–2 యాంథమ్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. వన్స్ ఐ స్టెపిన్ హిస్టరీ రిపీట్స్ అంటూ బాలయ్య డైలాగు రీసౌండింగ్ ఇస్తోంది. అయితే ఇప్పుడు ఆ షో నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అది కేవలం బాలయ్య అభిమానులనే కాదు.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సైతం ఊరిస్తోంది.
అతిథులు అనేకమంది..
అన్ స్టాపబుల్–2 సీజన్‌కి రాబోతున్న అతిథులు అంటూ చాలా పేర్లు వచ్చాయి. చిరంజీవి– పవన్ కల్యాణ్ కలిసి వస్తున్నారని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, చంద్రబాబు వస్తున్నారు అనే వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే వియ్యంకులు ఒక స్టేజ్ మీద ఉండి ప్రసంగిస్తేనే అభిమానులు, కార్యకర్తలు ఎంతో మురిసిపోతారు.