Balakrishna PA Arrest: సహజంగా యజమానులకంటే పీఏలకే అధికారాలు ఎక్కువ. వారు లేనిదే ఏ పని జరగదు. ఎక్కడి నుంచైనా పరిచయాలు పెంచుకుని వ్యవహారాలు చక్కబెట్టడంలో పీఏలదే ప్రత్యేక స్థానం. కానీ వారే అడ్డదారులు తొక్కుతుంటారు. తమ యజమానుల పరువు తీస్తుంటారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తూ చివరకు తలవంపులు తెస్తుంటారు. ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా తమకు సంబంధం లేదు జల్సాలే ముఖ్యమని గ్రహించి ఎలాంటి పనికిమాలిన పని చేయడానికైనా వెనకాడరు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ పీఏ బాలాజీ బాగోతం కూడా వెలుగులోకి రావడం గమనార్హం.
ఆయన ఎప్పుడు షూటింగులలో బిజీగా ఉండటంతో తమ వ్యవహారాలు చూడమని పీఏను పెట్టుకున్నారు. కానీ ఆయన పనులు చూడకుండా జల్సాలకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఏకంగా వైసీపీ నేతలతో కర్ణాటక సరిహద్దులో పేకాట ఆడుతూ దొరికిపోయారు. వైసీపీ కన్వీనర్ శ్రీరాంరెడ్డితో పాటు 19 మంది పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. గతంతో కూడా పలువురు ఇలా వ్యవహరించడంతోనే నమ్మకస్తుడైన వ్యక్తి అని బాలాజీని పెడితే అతడు కూడా ఇలా చేయడంతో బాలకృష్ణకు తలనొప్పిగా మారింది.
Also Read: కర్నూలు జనసేన ఆఫీసుకు తాళం.. అన్నంత పని చేసిన వైసీపీ నేతలు
దీంతో రాబోయే ఎన్నికల్లో బాలకృష్ణకు తలవంపులు తప్పేలా లేవు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పీఏల తీరు పార్టీకే కాకుండా ఆయనకు కూడా సమస్యలా మారనుంది. కర్ణాటకలోని నగరిగేర వద్ద డెన్ ఏర్పాటు చేసుకుని పేకాట ఆడుతున్న విషయం పోలీసులకు తెలిసింది. వారు వెళ్లి అందరిని అదుపులోకి తీసుకుని చిక్బల్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో హాజరు పరిచారు.
ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యతలు వదిలేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగి తేలడం పీఏలకే చెల్లు. ప్రస్తుతం బాలాజీ చేసిన తతంగం చర్చనీయాంశం అవుతోంది. బాలకృష్ణ ఎంతమందిని పీఏలుగా పెట్టుకున్నా ఇలా చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన పనులు ఎవరు చక్కబెడతారని ఆందోళన చెందుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలా గట్టెక్కడం అని తల పట్టుకుంటున్నారు.
Also Read: జగన్ ను దగ్గరి నుంచి చూస్తే.. పోసాని షాకింగ్ వ్యాఖ్యలు