తెలంగాణలో ఆ రెండు జిల్లాల పేర్లు మార్పు

తెలంగాణలో మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం కేసీఆర్.. రెండు జిల్లాల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వరంగల్ పర్యటనలో కొత్త జిల్లాలను ప్రకటించిన కేసీఆర్ తాజాగా దాన్ని అమలు పరిచారు. 13 మండలాలతో వరంగల్ జిల్లా.. 14 మండలాలతో హన్మకొండ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు ద్వారా ప్రస్తుత జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ కార్యవర్గాలు, మండల […]

Written By: NARESH, Updated On : August 12, 2021 7:14 pm
Follow us on

తెలంగాణలో మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం కేసీఆర్.. రెండు జిల్లాల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వరంగల్ పర్యటనలో కొత్త జిల్లాలను ప్రకటించిన కేసీఆర్ తాజాగా దాన్ని అమలు పరిచారు. 13 మండలాలతో వరంగల్ జిల్లా.. 14 మండలాలతో హన్మకొండ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు ద్వారా ప్రస్తుత జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ కార్యవర్గాలు, మండల పరిషత్, పరిధులపై ఎలాంటి ప్రభావం చూపవని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కార్యవర్గాలు ఏర్పాటయ్యే వరకూ ఇది వర్తిస్తుందని తెలిపింది.

కొత్త జిల్లాల పేర్ల మార్పు నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, వినయ్ భాస్కర్ లు జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై సమీక్షించారు. ఈరోజే వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ ను వెలువరించారు.

కొత్తగా ఏర్పడిన హన్మకొండ జిల్లాలో హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతోపాటు హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్ పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, పరకాల, నడికుడి, దామెర, ఆత్మకూరు, శాయంపేట మండలాలు వస్తాయి.

ఇక వరంగల్ కొత్త జిల్లాలో వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతోపాటు వరంగల్, ఖిలా వరంగల్, సంగెం, గీసుకొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట, చెన్నరావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ మండలాలు వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.