ఇంతకీ ఆ గుమ్మడికాయల దొంగ ఎవరు నాగబాబు…?

జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ ట్విట్టర్ లో యాక్టివ్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఎలా ఉండాలో…. జరిగే వాటిని గమనిస్తూ తమ అమూల్యమైన ఓటుని ఎలా వేయాలో గతంలో వివరించిన నాగబాబు ఇప్పుడు మరో ఆసక్తికరమైన వీటిని వేశారు. తాజాగా నాగ బాబు అడిగిన ప్రశ్న ఏమిటంటే.. తాను చేసిన ట్వీట్ లో గుమ్మడికాయల దొంగ ఎవరు అని అడుగుతున్నారు. నువ్వు చేసిన తప్పును గుర్తించి ఉలిక్కిపడి భుజాలు […]

Written By: Navya, Updated On : August 10, 2020 8:00 pm
Follow us on

జనసేన పార్టీ నేత మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ ట్విట్టర్ లో యాక్టివ్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఎలా ఉండాలో…. జరిగే వాటిని గమనిస్తూ తమ అమూల్యమైన ఓటుని ఎలా వేయాలో గతంలో వివరించిన నాగబాబు ఇప్పుడు మరో ఆసక్తికరమైన వీటిని వేశారు.

తాజాగా నాగ బాబు అడిగిన ప్రశ్న ఏమిటంటే.. తాను చేసిన ట్వీట్ లో గుమ్మడికాయల దొంగ ఎవరు అని అడుగుతున్నారు. నువ్వు చేసిన తప్పును గుర్తించి ఉలిక్కిపడి భుజాలు తడుముకున్నావే గుమ్మడికాయల దొంగ అని నాగబాబు ట్వీట్ వేయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. అయితే ఇక్కడ నాగబాబు ధైర్యంగా ఎవరి పేరునీ ప్రస్తావించకపోవడం గమనార్హం.

కానీ నాగబాబు ట్వీట్ ను ఒక్కొక్కరికీ ఒక్కోలాగా అర్థమయింది. వైసిపిని ఉద్దేశించి ఆ ట్వీట్ అని కొందరు అంటుంటే…. కాదు కాదు టిడిపి అధినేత చంద్రబాబు ని ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

https://twitter.com/NagaBabuOffl/status/1292739584434950146?s=20

రాష్ట్రంలో నడుస్తున్న కుల రాజకీయాల పైన నాగబాబు ట్వీట్ వేశాడా…. లేదా టిడిపి-వైసిపి అవినీతి రాజకీయాలను ఆయన ఈ విధంగా ప్రశ్నించారా అన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. మరోపక్క నాగబాబు మీద విపరీతమైన ట్రోలింగ్ కూడా జరుగుతుండడం విశేషం. ఇటు టీడీపీ, అటు వైసీపీ.. కలిసి కట్టుగా ఈ దాడికి పాల్పడుతుండడం గమనార్హం.

అదే సమయంలో టీడీపీ శ్రేణులు వైసీపీకి, వైసీపీ శ్రేణులు టీడీపీకి.. నాగబాబు ట్వీట్‌ని అన్వయిస్తుండడం మరో విశేషం. ఎలాగైనా చివరికి ఆ ఇద్దరూ కలిసి జనసేనపై ‘కులం’ పేరుతో, ఇతరత్రా అర్థం పర్థం లేని అంశాలతో జనసేనపై విషం చిమ్ముతున్నారనుకోండి.. అది వేరే సంగతి.