Homeఆంధ్రప్రదేశ్‌Pawan Nagababu : కార్యకర్తలు, వారి కుటుంబాల కోసం కోటి భీమా.. ప్రపంచంలో పవన్ ఒక్కడేనంటూ...

Pawan Nagababu : కార్యకర్తలు, వారి కుటుంబాల కోసం కోటి భీమా.. ప్రపంచంలో పవన్ ఒక్కడేనంటూ నాగబాబు ఎమోషనల్

Pawan Nagababu : బలోపేతమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోంది. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం బలగం.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేది వారే. ఇక జనసేన అభిమానులందరినీ పార్టీ కడుపున పెట్టుకొని కాపాడాలి. అలా చేస్తేనే పార్టీ ప్రజల్లో చిరకాలం బలంగా ఉంటుంది. ఆ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన సంచలన అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని జనసేన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు పిలుపునిచ్చింది.

జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు నాగబాబు తాజాగా క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదుపై సంచలన పిలుపునిచ్చారు. ఈనెల 10వ తేదీన క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. ‘జనసేన క్రియాశీలక సభ్యత్వం ద్వారా పార్టీతో అనుబంధం మరింత పెంపొందించుకోవడానికి ఈనెల 10 నుండి ప్రారంభమయ్యే మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాం. పార్టీ జెండా భుజాన మోసే కార్యకర్తల సంకల్పం, పట్టుదలను జనసేన ఏనాడూ విస్మరించదు. గతంలో సభ్యత్వ నమోదు చేసుకున్న వారు రెన్యువల్ చేసుకోవడానికి, కొత్తగా క్రియాశీలక సభ్యత్వం పొందడానికి ఫిబ్రవరి 10 నుండి 28 వరకు అవకాశం ఉంటుంది. జనసేన పార్టీకి కార్యకర్తలే వెన్ను దన్ను, ముఖ్యంగా క్రియాశీలకంగా ఉండే కార్యకర్తల కృషి ఫలితంగానే పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్తుందని విశ్వసిస్తున్నాం’ అని నాగబాబు తెలిపారు.

గత రెండు సంవత్సరాలుగా లక్షల సంఖ్యలో జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతం చేయాలని జనసేన నాయకులను, వీర మహిళలను, జన సైనికులను కోరుతున్నాం. ముఖ్యంగా ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియలో పార్టీ క్రియాశీలక వలంటీర్ల కృషి మరువలేనిది. కార్యకర్తలకు భరోసాను కల్పించడం మా బాధ్యత అని నాగబాబు అన్నారు.. కార్యకర్తలు, వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడం బాధ్యతగా భావించే పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా ప్రీమియం కోసం తమ వ్యక్తిగత సంపాదన నుంచి ప్రతీ సంవత్సరం కోటి రూపాయలు “క్రియాశీలక కార్యకర్తల భరోసా భీమా” కోసం ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 265 మంది బాధిత కుటుంబాలకు 5 కోట్ల 40 లక్షల 90 వేల రూపాయలు ప్రమాద భీమా చెల్లించడం జరిగింది.

కార్యకర్తలు, వారు కుటుంబాల భద్రత గురించి ఆలోచించి వ్యక్తిగత సంపాదన నుంచి కోట్ల రూపాయలు పార్టీ కార్యకర్తల కోసం వెచ్చించే అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ తప్ప ప్రపంచంలోనే ఇంకొకరు ఉండరు అనేది వాస్తవం. వినూత్నమైన ఈ భరోసా రాజకీయ పార్టీల్లో అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గత రెండు విడతలు విజయవంతంగా చేపట్టిన క్రియాశీలక వాలంటీర్లు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఈ సంవత్సరం కూడా మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం.

ఫిబ్రవరి 10న ప్రారంభమయ్యే మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొనండి-శ్రీ నాగబాబు గారు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version