Troll Of The Day: అసలే అధికారం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5, మహా టీవీ సపోర్టు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి 23 వద్ద కూర్చోబెట్టాడు.. అచ్చెం నాయుడు నుంచి రఘురామకృష్ణం రాజు వరకు జైల్లో పెట్టాడు.. పోలీసులతో వాయింపు కార్యక్రమం కూడా పూర్తి చేశాడు.. ఇక చంద్రబాబుతో కంటనీరు కూడా పెట్టించాడు.. ఇంతటి ఉక్క పోతలో చల్లదనం కలిగించేందుకు… 2024లో జగన్ బారి నుంచి తెలుగుదేశం పార్టీని రక్షించుకునేందుకు లోకేష్ బయలుదేరాడు.. కుప్పం నుంచి యువ గళాన్ని వినిపిస్తున్నాడు.. అదంతా ప్లాన్డ్ ప్రోగ్రాం. ఏం చేయాలో ముందే రాయబడి ఉన్న ప్రోగ్రాం.. ఇక దీనిని విజయవంతం చేసేందుకు పచ్చ మీడియా పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు.. లోకేష్ బాబును ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేసేందుకు ఎన్ని జాకీలు పెట్టి లేపాలో అన్ని జాకీలు పెడుతున్నాయి.

ఇక పాదయాత్రలో లోకేష్ చెమటలు కక్కుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పై నిప్పులు చెరుగుతున్నాడు. అంత కాదు ప్రభుత్వ విధానాలపై అంతెత్తున ఎగిసిపడుతున్నాడు.. కానీ ఎందుకనో జనం దీన్ని లైట్ తీసుకుంటున్నారు.. ముందుగానే చెప్పినట్టు ఇది ప్లాన్డ్ ప్రోగ్రామే కానీ జనం ఎందుకో టిడిపి పాట పాడటం లేదు.. అక్కడ కూడా లోకేష్ ఇబ్బంది పడేలా జగన్ మంత్రం జపిస్తున్నారు.. ఏపీ ముఖ్యమంత్రి కే జై కొడుతున్నారు.

పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో గ్రామంలో లోకేష్ అక్కడ స్థానికంగా ఉన్న మహిళలతో మాటామంతి నిర్వహించాడు.. ఈ ప్రభుత్వంలో మహిళలు సంతోషంగా లేరని, ఇబ్బందులు పడుతున్నారని… ఇలా సాగుతూ పోయింది లోకేష్ ప్రసంగం. లోకేష్ వంతు పూర్తయిన తర్వాత ఓ మహిళ మైక్ అందుకుంది.. తను ఏదో చెప్పుకుంటూ పోయింది. తీరా జగన్మోహన్ రెడ్డికి జై కొట్టింది.. అంతేకాదు ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరింది. పాపం అక్కడే ఉన్న లోకేష్ బాబు ముఖం కందిపోయింది.
