Nadendla Manohar: పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించిన జనసేన పార్టీకి.. ఈ మార్చి 14తో ఎనిమిదేండ్లు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆవిర్భావ సభకు కూడా ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందంటూ ఆరోపిస్తున్నారు పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్. వారంలో ఇప్పటికే దాదాపు నాలుగు సార్లు సభా స్థలం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంగళగిరిలోని మండలం పరిసర ప్రాంతంలో సభను నిర్వహించేందుకు తాము వెళ్లి రైతులతో మాట్లాడినప్పుడు భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారని, కానీ ఇప్పుడు మాత్రం వెనకడుగు వేస్తున్నారని చెప్పుకొచ్చారు. రైతుల మనసు ఎవరు మారుస్తున్నారో తమకు తెలుసంటూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇంత కక్ష పూరితంగా వేధించడం ఏంటంటూ విమర్శిస్తున్నారు.
Also Read: గవర్నర్ తమిళిసై అంటే కేసీఆర్ కు ఎందుకు కోపం?
ప్రజలు ఓట్లేసి 151ఎమ్మెల్యే సీట్లను కట్టబెడితే ఇంత అరాచక పూరితంగా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం తెలిపారు మనోహర్. ఇక పవన్‌ను వ్యక్తిగతంగా నష్టపరిచేందుకు ఇప్పటికే ఎన్ని రకాల కుట్రలు చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారంటూ వాపోయారు. అయితే పవన్‌ను ఎంత నష్టపరిచేందుకు ప్రయత్నించినా.. తాము మాత్రం పోరాడుతూనే ఉంటామని చెప్పుకొచ్చారు.
భీమ్లానాయక్ విషయంలో ఇప్పటికే ఎంత కుట్ర పూరితంగా వ్యవహరించారో ఆంధ్రా ప్రజలు చూశారని, పవన్ వెంట ప్రజలు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. కాగా వారం రోజుల్లోనే నాలుగు చోట్లకు సభా స్థలం మారడాన్ని బట్టి చూస్తుంటే.. ఇదంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అటు ఇతర పార్టీల్లో కూడా జనసేన పట్ల వైసీపీ వైఖరిని అందరూ ఖండిస్తున్నారు.
Also Read: తెలంగాణలో లిక్కర్ ధరలు తగ్గనున్నాయా?