PM Modi Secrets: నరేంద్ర మోదీ.. రెండు పర్యాయాలుగా దేశ ప్రధానిగా విజయవంతంగా ముందుకు సాగుతున్న నేత. సుదీర్ఘకాలం తరువాత బీజేపీ అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ప్రధానిగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి విభిన్న సంస్కరణలు చేస్తూ.. ప్రపంచస్థాయిలో దేశకీర్తిని చాటుతున్న వ్యక్తి. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న ప్రధానిగా గుర్తింపు పొందారు. ఏ విషయాన్ని అయినా.. సుదీర్ఘంగా ఆలోచన చేసి.. నిర్ణయం తీసుకోవడం మోదీకి అలవాటు. దేశ ప్రధానిగా సుదీర్ఘంగా పనిచేస్తూనే.. ప్రపంచ దేశాలను ఆకర్షించిన మోదీ గురించి.. బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా ఆసక్తికర అంశాలు వెల్లడించారు. బీజేపీలోని ముఖ్య నాయకుల్లో మోదీ తీసుకునే నిర్ణయం చాలా కీలకంగా ఉంటుందని చెప్పారు. ఆలోచన చేసి.. దాన్ని ఆచరణలో పెట్టడంలో మోదీ ముందుంటాడని వివరించారు.

బీజేపీ పార్టీ ప్రస్తుతం దేశంలో కీలక జాతీయ పార్టీల్లో ప్రథమస్థానంలో ఉంది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో.. బీజేపీ ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉండగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాషాయజెండాను ఎగరవేయాలని బీజేపీ నాయకులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ నిర్ణయం అంతా మోదీ నుంచి గ్రామ స్థాయి నాయకుడి వరకు సమష్టి ఆలోచనతోనే సాధ్యమవుతోందని నడ్డా వివరించారు. పార్టీలో కీలకనేతలైన మోదీ.. అమిత్ షా.. రాజ్ నాథ్ సింగ్ తదితరులు అందరూ కలిసే నిర్ణయం తీసుకుంటారని వివరించారు. జాతీయస్థాయిలో ఏదైన ముఖ్యనిర్ణయం తీసుకున్న సమయంలో మోదీ ఆచితూచి వ్యవహరిస్తారని.. ముందుగా దాని గురించి అందరితో చర్చించిన తరువాతనే ముందుకు సాగుతారని అదే మోదీ సక్సెస్ సీక్రెట్ గా నడ్డా వివరించారు. కొన్ని పర్యాయాలు గుజరాత్ సీఎంగా.. రెండు సార్లు దేశ ప్రధానిగా కొనసాగుతున్న మోదీ చెబితే.. పార్టీలోని ముఖ్యనేతలంతా సరే అంటారని నడ్డా చెప్పుకొచ్చారు.
Also Read: బీజేపీ దూకుడు.. టార్గెట్ 2023 ప్లాన్ రెడీ చేస్తున్న బండి సంజయ్
పార్టీ ముందుకు సాగాలంటే.. నాయకుడు కావాలి. నాయకుడు చెప్పంది వినే సైనికులు ఉండాలి. బీజేపీలోనూ అదే జరుగుతోంది. ప్రధాని మోదీ క్రియాశీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరణకు కారణం అవుతున్నాయి. ప్రతీ రాష్ట్రంలో బీజేపీ పాగా వేస్తోందంటే నాయకుడు అనుసరించే మార్గమే ముఖ్యమని నడ్డా వివరించారు. ఇక్కడా అదే జరుగుతోంది. బీజేపీ లోని ముఖ్యనేతలందరూ సమష్టిగా తీసుకుంటున్న నిర్ణయాలు.. కీలక సమయాల్లో అనుసరిస్తున్న విధివిధానాలు పార్టీకి బలాన్ని ఇచ్చేలా ఉంటున్నాయి. ఇదే బీజేపీకి బూస్టర్ గా మారుతోంది.