Liquor Price Telangana: తెలంగాణలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. తన ఆదాయం పెంచుకునే క్రమంలో ధరలు విపరీతంగా పెంచుతోంది. ఫలితంగా మద్యం ప్రియుల జేబులు గుల్ల అవుతున్నాయి. ఎంత పెంచినా ఎవరు ఏమి అనకపోవడంతో సులువుగా ఉండే మార్గంగా మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో మరోమారు ధరల పెరుగుదలతో మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. ధరలు పెంచడంలో ఆంధ్రప్రదేశ్ నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. అక్కడ మద్యం ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. మందుబాబులపై భారం మోపుతూనే ఉంది.

తెలంగాణలో వస్తున్న ఆదాయానికి చేస్తున్న ఖర్చులు పొంతన ఉండటం లేదు. దీంతో ఆదాయ మార్గాలపై కన్నేసింది. ఇందులో భాగంగానే మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వకుండా దాట వేస్తోంది. ఈ నేపథ్యంలో రాబడిపై దృష్టి సారించింది. సులువుగా వచ్చే ఆదాయంలో మద్యం వ్యాపారమే ముందుంటుంది. అందుకే దీన్ని ఆసరాగా తీసుకుంటోంది. ఇప్పటికే ఏడాదికి దాదాపు రూ. 30 వేల కోట్ల ఆదాయం మద్యం ద్వారా సమకూరుతోంది. ఇప్పుడు పెంచిన ధరలతో మరో రూ. 7 వేల కోట్లు వచ్చే వీలుంది.
Also Read: Elon Musk- Twitter: కొనకపోతే ఎలన్ మస్క్ ను వదిలేది లేదంటున్న ట్విట్టర్..
కేంద్ర ప్రభుత్వం కూడా అప్పు ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు లక్షల కోట్లు అప్పు ఉండటంతో ఇక చేసేది లేక మళ్లీ అప్పులే చేయాల్సి వస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మనది కూడా మరో శ్రీలంక కావడం ఖాయమని ప్రతిపక్షాలు జోస్యం చెబుతున్నాయి. దీంతో పూట గడవడమెలా అనే ఆందోళనలో పడిపోతోంది. ఉద్యోగుల వేతనాలు నిలుపుదామంటే వచ్చేది ఎన్నికల కాలం కావడంతో జీతాలు ఆపేస్తే దాని ప్రభావం ఓట్లపై పడుతుందనే నెపంతో ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది.

రాష్ట్రంలో మద్యం ధరలు మళ్లీ పెరిగాయి. 20 నుంచి 25 శాతం ధరలు పెంచుతూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో బీరు బాటిల్ పై రూ. 10, క్వార్టర్ సీసాపై రూ. 20 వరకు పెంచింది. దీంతో పెరిగిన రేట్లను ఇవాళో రేపో అదికారికంగా ప్రకటించనుంది. పెంచిన ధరలకే మద్యం విక్రయించాలని నిబంధన విధించింది. ఒకవేళ తక్కువ ధరకు అమ్మినట్లయితే చట్టపరంగా శిక్షార్హులవుతారని రాష్ర్ట అబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు.
పెంచిన ధరలతో మందుబాబులకు తాగకుండానే కిక్కు ఎక్కనుంది. ప్రభుత్వం ఇలా పెంచుకుంటూ పోతే ఇక వారి ఆశలు కూడా వమ్ము కావాల్సిందే. రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. మద్యం ధరలు పెంచితే ఇక తాగుడు ఎలా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంతో మరోసారి విమర్శలు ఎదుర్కొంటోంది.
Also Read:Hero Vijay Meet KCR: కేసీఆర్ ను స్టార్ హీరో కలవడం వెనుక పెద్ద ప్లానే ఉందే!