https://oktelugu.com/

టీవీ5 నుంచి మూర్తి, సాంబశివరావు ఎగ్జిట్.. కారణమేంటి?

తెలుగు న్యూస్ చానెల్స్ చూసిన వారందరికీ సీనియర్ వివాదాస్పద జర్నలిస్టులు మూర్తి, సాంబశివరావులు చిరపరిచితులే.. పచ్చ గడ్డి ఉన్నా లేకున్నా తమ వివాదాలతో నిప్పు రాజేయగల సమర్థులని జర్నలిస్టు సర్కిల్స్ లో పేరుంది. వీరిద్దరి వివాదాస్పద తీరు కారణంగా ఆ చానెల్స్ కు బాగానే రేటింగ్ వస్తోంది. *వైదొలిగేందుకు రెడీ ఈ వివాదాస్పద జర్నలిస్టులు మూర్తి, సాంబశివరావులు ప్రముఖ న్యూస్ చానెల్ టీవీ5 చానల్ లో చాలా రోజులుగా పనిచేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ చానెల్ నుంచి బయటపడ్డట్టు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 6, 2020 / 05:59 PM IST
    Follow us on


    తెలుగు న్యూస్ చానెల్స్ చూసిన వారందరికీ సీనియర్ వివాదాస్పద జర్నలిస్టులు మూర్తి, సాంబశివరావులు చిరపరిచితులే.. పచ్చ గడ్డి ఉన్నా లేకున్నా తమ వివాదాలతో నిప్పు రాజేయగల సమర్థులని జర్నలిస్టు సర్కిల్స్ లో పేరుంది. వీరిద్దరి వివాదాస్పద తీరు కారణంగా ఆ చానెల్స్ కు బాగానే రేటింగ్ వస్తోంది.

    *వైదొలిగేందుకు రెడీ
    ఈ వివాదాస్పద జర్నలిస్టులు మూర్తి, సాంబశివరావులు ప్రముఖ న్యూస్ చానెల్ టీవీ5 చానల్ లో చాలా రోజులుగా పనిచేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ చానెల్ నుంచి బయటపడ్డట్టు జర్నలిస్ట్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ ఎగ్జిట్ కు సిద్ధమైనట్టు సమాచారం.

    జర్నలిస్టుల సమస్య.. కేసీఆర్ కు నిజంగా తెలియదా?

    *రాజీనామా లేఖలు ఇవ్వమని కోరారట?
    మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. టీవీ5 మేనేజ్ మెంట్ తాజాగా ఈ ఇద్దరు దిగ్గజ జర్నలిస్టులను తమ రాజీనామా లేఖలను ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఏ కారణం లేకుండానే వీరిని రాజీనామా చేయాలని సూచించిందట.. దీంతో మూర్తి, సాంబశివరావులు చానెల్ నుంచి తొందరలోనే వైదొలిగేందుకు రెడీ అయినట్లు సమాచారం.

    *సీనియర్ ఎడిటర్ హోదాలో చక్రం తిప్పిన సాంబశివరావు
    సాంబశివరావు టీవీ5లో సీనియర్ ఎడిటర్ హోదాలో ఉన్నారు. ఆయన ప్రతీరోజు ఏదో ఒక బర్నింగ్ విసయంపై ప్రత్యేక చర్చ జరుపుతాడు. ఇక మూర్తి వివాదాస్పద అంశాలపై చర్చలు జరుపుతారు. వివాదాలతోనే చానెల్ కు రేటింగ్ తీసుకొస్తాడు.

    లాక్ డౌన్ బాధిత ప్రజలపై పెట్రోల్ ధరల మోత

    *టీడీపికి వ్యతిరేకంగా వెళ్తున్నందుకేనా?
    టీవీ5 చానెల్ మేనేజ్ మెంట్ ఆది నుంచి తెలుగుదేశం అనుకూల చానెల్ గా ప్రసిద్ధి చెందింది. మూర్తి, సాంబశివరావులు ఇద్దరూ టీడీపీ పట్ల , దాని అధ్యక్షుడు చంద్రబాబు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు సంస్థ గుర్తించినట్టు సమాచారం. వారిద్దరూ టీడీపీకి నష్టం చేసేలానే వ్యవహరిస్తున్నారని టీడీపీ నుంచి ఫిర్యాదులు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అందుకే ఉన్న ఫళంగా వీరిద్దరిని పీకిపారేయమని ఆదేశాలు రావడంతోనే సాగనంపుతున్నట్టు ప్రచారం సాగుతోంది..

    *వైసీపీకి మూర్తి, సాంబశివరావు వ్యతిరేకమే..
    వాస్తవానికి సాంబశివరావు ఆది నుంచి వైసీపీ పార్టీని లక్ష్యంగా చేసుకునే లేదా టీడీపీకి మద్దతుగా విషయాలను తీసుకునే చర్చ జరుపుతాడు. ఇక మూర్తి అనేక సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని బహిరంగంగా సవాల్ చేస్తుంటాడు.ఈ ఇద్దరూ వైసీపీకి వ్యతిరేకంగా ఉంటున్న సంస్థ ఎందుకు తీసివేస్తుందనేది అందరికీ ఆశ్చర్యంగా ఉంది.

    మద్యం అమ్మకాలపై ముఖం చాటేస్తున్న ప్రధాని మోదీ!

    *వైసీపీతో టీవీ5 అవగాహన చేసుకుందా? అందుకేనా?
    ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో మీడియాలు కుదేలయ్యాయి. టీడీపీని నమ్ముకుంటే లాభం లేదనుకున్న టీవీ5 ఏపీలోని అధికార వైసీపీ పార్టీతో ఒక అవగాహనకు వచ్చి ఉండవచ్చన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ అనుకూల దృక్ఫథం కారణంగా చానెల్ ప్రేక్షకుల అభిమానాన్ని కోల్పోయి రేటింగ్ పడిపోయిందట.. వీక్షకుల సంఖ్యను కోల్పోవడంతోనే వైసీపీ సైడ్ రూట్ మార్చినట్టు తెలుస్తోంది. అయితే పూర్తిగా టీడీపీకి దూరం కాకుండా.. వైసీపీకి వ్యతిరేకం కాకుండా న్యూట్రల్ గా మారేందుకు డిసైడ్ అయినట్టు సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో ఖచ్చితంగా తెలియదు.

    *మూర్తి మళ్లీ ఏబీఎన్ లోకా?
    ఏది ఏమైనా ఇద్దరు దిగ్గజ జర్నలిస్టులు టీవీ5 నుంచి వైదొలగడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీళ్లిద్దరూ ఎక్కడికి వెళతారనేది ఆసక్తిగా మారింది. మూర్తి ఇదివరకు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలోకి మళ్లీ వెళ్లే అవకాశాలున్నాయి. కానీ రానిస్తారో లేదో చూడాలి మరీ..