https://oktelugu.com/

సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?

బిజెపి ఎంపీ సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ లు సమావేశం అయిన వీడియోను బయట పెట్టిన వైసీపీ రాజకీయంగా లబ్ధిపొందాలని చూసింది. ఈ అంశాన్ని సొంత మీడియాలో మూడు రోజులపాటు కథనాలు, వార్తల రూపంలో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఎంపీ సుజనా చౌదరిపై నిఘా పెట్టడంతో ఈ వీడియో వైసీపీకి లభించిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి ఓగట్టి షాక్ తగిలింది. వైసీసీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు సుజనను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 27, 2020 / 10:45 AM IST
    Follow us on


    బిజెపి ఎంపీ సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ లు సమావేశం అయిన వీడియోను బయట పెట్టిన వైసీపీ రాజకీయంగా లబ్ధిపొందాలని చూసింది. ఈ అంశాన్ని సొంత మీడియాలో మూడు రోజులపాటు కథనాలు, వార్తల రూపంలో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఎంపీ సుజనా చౌదరిపై నిఘా పెట్టడంతో ఈ వీడియో వైసీపీకి లభించిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి ఓగట్టి షాక్ తగిలింది. వైసీసీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు సుజనను కలిసి వీడియోలకు చిక్కినట్లు చర్చ నడుస్తోంది. దీంతో వైసీపీ అధిష్టానంలో ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని బయటపెడితే పార్టీ, ప్రభుత్వం పరువు పోతుందని ఆలోచించిన రహస్యంగా ఉంచుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

    మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

    ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఇద్దరు కీలకమైన వ్యక్తులు సుజనను కలిసి వీడియోలో దొరికిన నేతలను పిలిచి, సుజనాను ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏ అంశాలు మాట్లాడారనే వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. ఒక పక్క వైసీపీ చెందిన పది మంది ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వీడియో పుటేజ్ ల దృశ్యాలు ఆ వార్తలు నిజం చేసేదిగా ఉండటంతో వైసీసీలో కలవరం మొదలైంది.

    ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ సమస్యలను ఎదుర్కొంటుంది. షోకాజ్ నోటీస్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. ఆయనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్ ను ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తనకు బి ఫామ్ ఇచ్చిన లెటర్ హెడ్ నుంచి కాకుండా వేరే లెటర్ హెడ్ నుంచి షోకాజ్ నోటిస్ ఇచ్చారనే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సుజనాను వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసిన విషయం వెలుగులోకి రావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితిగా విశేషకులు భావిస్తున్నారు.

    ‘బీహార్‌ ఎన్నికల కోసం బీజేపీ గల్వాన్‌ నాటకం!’

    మరోవైపు తనపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా ఉంచడాన్ని ఎంపీ సుజనా చౌదరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతల్లో గుబులు మొదలైంది. తమపైనా ప్రభుత్వం నిఘా ఉంటుందని భావిస్తున్నారు.