Homeజాతీయ వార్తలుMunugode By Election- KCR: ఉద్యమకారులంతా టీఆర్‌ఎస్‌లోకి.. ఫోన్‌లో చక్రంతిప్పుతున్న కేసీఆర్‌!

Munugode By Election- KCR: ఉద్యమకారులంతా టీఆర్‌ఎస్‌లోకి.. ఫోన్‌లో చక్రంతిప్పుతున్న కేసీఆర్‌!

Munugode By Election- KCR: మునుగోడు ఉప ఎన్నికల వేళ.. దాదాపు పది రోజులు ఢిల్లీలో ఉన్న టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణకు వచ్చి రావడంతోనే బీజేపీకి షాక్‌ ఇచ్చే పనిలో పడ్డారు. ఆపరేషన్‌ ఆకర్స్‌ను స్పీడప్‌ చేశారు. ఎవరినీ పర్సనల్‌గా కలువకుండా.. ఫామ్‌హౌస్‌లో కూర్చొని.. ఫోన్‌ కాల్స్‌తో ఉద్యమకారులను సొంతగూటికి రప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే దాసోజు శ్రవణ్‌ బీజేపీకి రాజీనామా చేశారు. అదేబాటలో శాసన మండలి మాజీ స్పీకర్, తెలంగాణ ఉద్యమకారుడు స్వామిగౌడ్‌ కూడా ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు మరికొందరు ఉద్యమకారులకు కూడా సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది.

Munugode By Election- KCR
KCR

ఉద్యమకారులను సొంతగూటికి రప్పించేలా..
తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌లో ఉండి.. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత వివిధ కారణాలతో పార్టీని వీడిన నాయకులు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. వారందరినీ సొంతగూటికి రప్పించేందుక టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీని వీడిపోయిన తెలంగాణ ఉద్యమకారులకు ఫోన్లు చేస్తున్నారు. దాసోజు శ్రవణ్‌ కుమార్, విఠల్‌గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌కు కూడ ఫోన్‌ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. సీఎం నుంచి పిలుపు వచ్చిన వెంటనే దాసోజు శ్రవణ్‌కుమార్‌ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కు పంపారు. కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

ఒక్క గౌడ్‌ పోయాడని..
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలోనే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పారు. కేసీఆర్‌ వ్యతిరేక పార్టీ బీజేపీలో చేరారు. అయితే, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు బీసీలే. దీంతో బీసీ ఓటర్లు చేజారకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బూర నర్సయ్యగౌడ్‌ బీజేపీలో చేరడంతో టీఆర్‌ఎస్‌ ప్రతివ్యూహలకు పదును పెట్టింది. గౌడ్‌ నేతలంతా టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్నారని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్‌లో ఉన్న చండూరు ఎంపీపీ పల్లె రవికుమార్‌గౌడ్‌ దంపతులను టీఆర్‌ఎస్‌ చేర్చుకున్నారు. తర్వాత బీజేపీలో ఉన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌లోకి రప్పించారు. తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్‌తో బీజేపీకి రాజీనామా చేయించారు. మరో గౌడనేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, శాసన మండలి తొలి చైర్మన్‌ స్వామిగౌడ్‌తోపాటు టీఎస్‌ పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్‌గౌడ్‌కు కూడా కేసీఆర్‌ ఫోన్‌చేసి టీఆర్‌ఎస్‌కి తిరిగి రావాలని ఆహ్వానించారని తెలుస్తోంది. వీరు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

 

Munugode By Election- KCR
Munugode By Election- KCR

ఢిల్లీ లాబీయింగ్‌ ఫలించలేదా?
లిక్కర్‌ స్కాంలో తన కూతురు కల్వకుంట్ల కవితను తప్పించేందకు పది రోజుల క్రితం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారు. ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయన్‌సింగ్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యూపీ వెళ్లిన కేసీఆర్, కవిత, సంతోష్‌రావు అటునుంచి అటే ఢిల్లీ వెళ్లారు. అప్పటికే కవితతో వ్యాపార సంబంధాలు ఉన్న అభిషేక్‌రావును సీబీఐ అరెస్ట్‌ చేసి కస్టడీలోకి తీసుకుంది. ఆయన విచారణ తర్వాత కవిత అరెస్ట్‌ అని ఢిల్లీలో ప్రచారం జరిగింది. దీంతో డ్యామేజీ కంట్రోల్‌ కోసం గులాబీ బాస్‌ ఢిల్లీ వెళ్లారు. రెండు రోజులు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాకాలాపాల్లో ఉన్నట్లు మీడియా ముందు కనిపించారు. తర్వాత ఎవరికీ కనిపించలేదు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మంతనాలు సాగించినట్లు ప్రచారం జరిగింది. తన కూతురు కవితను స్కాం నుంచి తప్పిస్తే మునుగోడు సీటులో బీజేపీని గెలిపిస్తామని కూడా ఆఫర్‌ ఇచ్చినట్లు సోషల్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, తాజాగా తెలంగాణకు వచ్చిన కేసీఆర్‌ బీజేపీని టార్గెట్‌ చేయడం, టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరినవారిని సొంతగూటికి రిప్పస్తుండడం చూస్తుంటే ఢిల్లీలో చేసిన లాబీయింగ్‌ బెడిసి కొట్టిందన్న వార్తలు వస్తున్నాయి. అందేకు ఆపరేషన ఆకర్ష్‌కు పదును పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular