Homeజాతీయ వార్తలుMq-9 Reaper Drone: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ ఇదే.. MQ-9 రీపర్ డ్రోన్...

Mq-9 Reaper Drone: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ ఇదే.. MQ-9 రీపర్ డ్రోన్ గురించి తెలుసా?

Mq-9 Reaper Drone: భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రెండు దేశాలు కూడా డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ టర్కీ, ఇతర దేశాల ఆయుధాలపై ఆధారపడి భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే భారత సైన్యం వారి డ్రోన్లన్నింటినీ సమర్థవంతంగా కూల్చివేసింది. ఈ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ ఏది?.. భారత్‌ వద్ద అలాంటి తిరుగులేని ఆయుధం ఉందా అనే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతునున్నాయి. గర్వించదగ్గ విషయం ఏమిటంటే.. భారత్‌ వద్ద ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్, ప్రమాదకరమైన డ్రోన్ MQ-9 రీపర్ ఉంది. ఈ డ్రోన్ ఫీచర్లు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

Also Read: సాగరనగరం పై నిఘా.. పోలీసుల జల్లెడ!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన MQ-9 రీపర్ డ్రోన్
MQ-9 రీపర్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, అధునాతన డ్రోన్‌గా పరిగణిస్తారు. దీనిని అమెరికా తయారు చేసింది. శత్రువుల నిఘా, గూఢచర్యం, దాడి కోసం ఉపయోగిస్తారు. ఈ డ్రోన్ చాలా ఎక్కువసేపు, ఎత్తులో ఎగరగలదు. అంతేకాకుండా, శత్రువు స్థావరాలపై రహస్యంగా, కచ్చితత్వంతో దాడి చేయగలదు. ఈ డ్రోన్ ప్రత్యేకత దాని పవర్, రేంజ్. MQ-9 రీపర్ దాదాపు 1900 కిలోమీటర్ల పరిధిలో ఎగరగలదు. 50,000 అడుగుల ఎత్తు వరకు చేరుకోగలదు. దీని వేగం గంటకు దాదాపు 482 కిలోమీటర్లు. ఈ డ్రోన్ ఒకసారి 1800 కిలోల వరకు ఇంధనాన్ని, 1700 కిలోల వరకు ఆయుధాలను తీసుకెళ్లగలదు.

దీనిని ఎలా నియంత్రిస్తారు?
MQ-9 రీపర్‌ను భూమిపై కూర్చున్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు వీడియో గేమ్ లాగా నియంత్రిస్తారు. దీని పొడవు 36.1 అడుగులు, రెక్కల పొడవు 65.7 అడుగులు, ఎత్తు 12.6 అడుగులు. దీని ఖాళీ బరువు దాదాపు 2223 కిలోలు. ఆయుధాల విషయానికి వస్తే దీనికి 7 హార్డ్ పాయింట్లు ఉన్నాయి. దీనిపై 4 AGM-114 హెల్‌ఫైర్ క్షిపణులు సెట్ చేసి ఉంటాయి. ఇవి గాలి నుండి భూమి మీదకు ఖచ్చితమైన దాడి చేస్తాయి. అంతేకాకుండా రెండు GBU-12 పావ్‌వే II లేజర్ గైడెడ్ బాంబులు కూడా అమర్చబడి ఉంటాయి. ఈ ఆయుధాలు దీనిని మరింత ప్రమాదకరంగా చేస్తాయి.

భారత్‌ వద్ద ఈ డ్రోన్ ఉందా?
భారత్‌ వద్ద ఈ డ్రోన్ ఉందా అనే ప్రశ్నకు సమాధానం అవుననే. MQ-9 రీపర్ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారత్, అమెరికా మధ్య ఒప్పందం ఇదివరకే కుదిరింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 34,500 కోట్ల రూపాయలు. భారతదేశంలో ఈ డ్రోన్ల మెయింటెనెన్స్, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్ కోసం ఒక ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వీటి నిర్వహణ దేశంలోనే సాధ్యమవుతుంది.

Also Read: దేశం కోసం ప్రాణాలనే పణంగా పెట్టాడు.. ఈ నటుడికి సెల్యూట్!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version