విజయసాయిరెడ్డి మాటల్లో ఆంతర్యమేమిటో?

పార్లమెంట్ ను స్తంభింపచేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. అది ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులపైనో నిధులపైనో కాదు. పార్లమెంట్ లో ప్రజాసమస్యలపై పోరాడిన దాఖలాలు లేవు. అయితే ప్రత్యేక హోదా కోసం అనుకుంటారేమో కానీ అది కూడా కాదు. సమస్యలపైనా కూడా లేదు. మరి ఏ విషయంలో స్తంభింపచేస్తారంటే అదే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనర్హత వేటు విషయంలో. దీంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ […]

Written By: Srinivas, Updated On : July 9, 2021 6:58 pm
Follow us on

పార్లమెంట్ ను స్తంభింపచేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. అది ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులపైనో నిధులపైనో కాదు. పార్లమెంట్ లో ప్రజాసమస్యలపై పోరాడిన దాఖలాలు లేవు. అయితే ప్రత్యేక హోదా కోసం అనుకుంటారేమో కానీ అది కూడా కాదు. సమస్యలపైనా కూడా లేదు. మరి ఏ విషయంలో స్తంభింపచేస్తారంటే అదే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనర్హత వేటు విషయంలో. దీంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పటికే ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి విన్నవించారు కానీ ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో విజయసాయిరెడ్డికి కోపం వచ్చిందట. స్పీకర్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆయనపైనే ఆరోపణలు చేసేందుకు వెనుకాడడం లేదు. ఇదే సందర్భంలో ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయకపోతే పార్లమెంట్ నే స్తంభింపచేస్తామని హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విజయసాయిరెడ్డి ప్రకటనతో నేతలంతా ఆందోళన చెందుతున్నారు. పార్లమెంట్ ను స్తంభింపచేస్తామని పెద్ద మాటలు చెప్పడంతో ప్రజలు ఆయనపై సహజంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేసిన ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఇలా మాట్లాడడంపై ఆవేదన చెందుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమైతే పార్లమెంట్ ను స్తంభింప చేస్తామంటే ప్రజలు కూడా సహకరించేవారు. కానీ పార్టీ కోసం ఇంతలా బరితెగించి మాట్లాడడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

విజయసాయిరెడ్డి నిర్వాకంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజాసమస్యలపై పట్టించుకోకుండా పార్టీని కాపాడాలనే తాపత్రయ పడడంపై పెదవి విరుస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా మాట్లాడడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. సొంత పార్టీ ఎంపీపై కావాలనే దురుద్దేశంతో అనర్హత వేటువేయాలని కోరుతున్నారనే సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ మనుగడ రాబోయే రోజులలో కష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.