
ఒకప్పుడు పేరున్న పార్టీ అది. కురవృద్ధ రాజకీయనేతలకు అడ్డా వారి పార్టీ. పేరుమోసిన నేతలు.. రాజకీయ ఉద్దండులున్న కాంగ్రెస్ పార్టీలో నేతలు రానురాను హస్తగతం అవుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రథమస్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధమస్థానంలోకి వెళ్లిపోయింది. పొద్దున లేస్తే.. కార్యకర్తలతో జనాల్లోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఇండ్లు.. పార్టీ ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. కొరవడిన ఐకమత్యం.. ఎవరికివారే లీడర్ షిప్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లలేకపోతుందన్నది వాస్తవం. అయితే 2018 ఎన్నికలు పక్కన పెడితే.. ప్రధాన జీహెచ్ఎంసీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నేతలు ప్రచారానికి కాలు కదపడం లేదు. ప్రచారాన్ని మొత్తం రేవంత్ రెడ్డి ఒక్కనే బుజాన ఎత్తుకుని ముందుకు సాగుతున్నాడు.
Also Read: తెలంగాణలోని ఆ ప్రాంతంలో పందుల పోటీలు.. ఫ్రైజ్ మనీ ఎంతంటే..?
అయితే టీపీసీసీ చీఫ్ పదవికోసం చాలా మంది చాలాకాలంగా ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం వద్దు.. ఆయనకన్నా.. మాకు స్టామినా.. ఎక్కువుంది అని వాదిస్తున్న నేతలు.. పార్టీ పరమైన కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఎవరికివారే సొంత యాత్రలు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఆ పార్టీని అసలు పట్టించుకోవడం లేదు. గ్రేటర్ ఎన్నికల సమయంలో ఒంటరి ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. అదే స్పూర్తితో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ మినహా ఎవరూ కనిపించడం లేదు.
Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ షెడ్యూల్ విడుదల..!
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.. అప్పుడప్పుడు నల్లగొండలో ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ కోసం పోటీపడ్డ నేతలు ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి చిన్నారెడ్డిని పోటీలో నిలిపింది.అక్కడ కూడా సీనియర్లు ఎవరూ కనిపించడం లేదు. ఎంపీ రేవంత్ రెడ్డి సర్వం తానై వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ సీనియర్లు కూడా ఎన్నికలతో తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉన్నారు.కలిసొచ్చే ఒకరిద్దరు నాయకుల సాయంతోనే అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయకుండా భట్టి విక్రమార్క.. జీవన్ రెడ్డి లాంటి నేతలు.. సొంత యాత్రలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ.. సైకిల్ యాత్ర చేపడుతున్నారు. అదికూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమేనని వారు కవర్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల తీరు చూసి.. పదవులు ఇస్తేనే ప్రచారం చేస్తామన్నట్లుగా వారి తీరు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేదని.. కాంగ్రెస్ హై కమాండ్ అలా ఉన్నంతకాలం కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పు రాదని పలువురు విశ్లేషకులు అంటన్నారు.