https://oktelugu.com/

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కంటే రఘురామే తోపు అట!

ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ ను చూసి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు వేశారు. కొన్ని తెలుగు న్యూస్ చానెల్స్ రఘురామకు డబ్బులు ఇచ్చి మరో డిబేట్స్ నిర్వహించాయి.. ఓ మీడియా చానెల్ అధినేత రూ.8.8 కోట్ల రూపాయలు రఘురామకు బదిలీ చేశారని ఏపీ ప్రభుత్వం ఆధారలతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అఫిడవిట్ పై ఎంపీ రఘురామ సెటైర్లు వేశారు. తాను చిరంజీవి, పవన్ కళ్యాణ్ కన్నా తోపు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 20, 2021 / 09:53 AM IST
    Follow us on

    ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ ను చూసి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు వేశారు. కొన్ని తెలుగు న్యూస్ చానెల్స్ రఘురామకు డబ్బులు ఇచ్చి మరో డిబేట్స్ నిర్వహించాయి.. ఓ మీడియా చానెల్ అధినేత రూ.8.8 కోట్ల రూపాయలు రఘురామకు బదిలీ చేశారని ఏపీ ప్రభుత్వం ఆధారలతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అఫిడవిట్ పై ఎంపీ రఘురామ సెటైర్లు వేశారు.

    తాను చిరంజీవి, పవన్ కళ్యాణ్ కన్నా తోపు అని.. నాకే ప్రజాదరణ ఎక్కువేమో.. అందుకే మీడియా సంస్థలు వారిని మించి పారితోషికం ఇచ్చి నా ప్రసంగాలు ప్రసారం చేస్తున్నాయని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.

    రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రపన్ని ఓ మీడియా సంస్థ నుంచి తాను మిలియన్ యూరోలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని ఎంపీ రఘురామ ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు మీడియాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు అత్యధిక పారితోషికం ఇస్తున్నట్లు విన్నామని.. కానీ వారి కంటే నాకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్లు ఉందని రఘురామ తెలిపారు. అందుకే నాకు ఇంత మొత్తం ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

    ఇక తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం చేస్తున్నారని.. నా రాజీనామా అన్న ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నా సభ్యత్వం రద్దు కావడం కల్ల అని తెలిపారు.

    మొత్తం రఘురామ తీరు చూస్తుంటే ప్రతి సందర్భంలోనూ అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలానే ఉన్నారు. ఆయన తీరు చూస్తుంటే వెనక్కి తగ్గేలా కనిపించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.