రఘురామ కాళ్ల కణాలు దెబ్బతిన్నాయని ఎయిమ్స్ ప్రకటన

ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారంలో ప్రభుత్వం సీఐడీని పావుగా వాడుకుంటోంది. దీంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి జైలుకు పంపి తన కసి తీర్చుకుంది. రఘురామ కూడా ప్రభుత్వంపై అనుకున్నస్థాయిలో ఆరోపణలు చేసి తన పంతం నెగ్గించుకున్నారు. దీంతో ప్రస్తుతం కేసు రసకందాయంలో పడింది. సుప్రీంకోర్టు గడపకు చేరడంతో సీఐడీ చిక్కుల్లో పడినట్లయింది. ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఎంపీ నేరుగా ఢిల్లీ వెళ్లిపోయి ఎయిమ్స్ లో చేరారు. పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాదాల్లోని […]

Written By: Srinivas, Updated On : May 28, 2021 2:21 pm
Follow us on

ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారంలో ప్రభుత్వం సీఐడీని పావుగా వాడుకుంటోంది. దీంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి జైలుకు పంపి తన కసి తీర్చుకుంది. రఘురామ కూడా ప్రభుత్వంపై అనుకున్నస్థాయిలో ఆరోపణలు చేసి తన పంతం నెగ్గించుకున్నారు. దీంతో ప్రస్తుతం కేసు రసకందాయంలో పడింది. సుప్రీంకోర్టు గడపకు చేరడంతో సీఐడీ చిక్కుల్లో పడినట్లయింది.

ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఎంపీ నేరుగా ఢిల్లీ వెళ్లిపోయి ఎయిమ్స్ లో చేరారు. పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాదాల్లోని సెల్స్ బాగా దెబ్బతిన్నాయని చెప్పింది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో కాళ్లు, పాదాలకు రెండు వారాల పాటు ఎక్కడా తిరగకూడదని సూచించారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నోరు విప్పలేకపోయిన రఘురామ రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

2019 ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చెడిందో కాని దూరం విపరీతంగా పె రిగిపో యింది. పరిస్థితి గమనించిన ప్రతిపక్షాలు సైతం తమ పబ్బం గడుపుకోవడానికి రఘురామ వైపు నిలిచి ఆయనలో కోపం పెరిగేలా చేశారు. దీంతో ఇద్దరిలో బేషజాలు పెరిగి చివరికి కేసుల వరకు వెళ్లింది. ఎంపీ నోరు పారేసుకోవడంతో రాజద్రోహం కేసు నమోదు చేసి కటాకటాల పాలు చేసింది.

సుప్రీంకోర్టులో కేసు తేలేంతవరకు రఘురామ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ నోరు విప్పేందుకు అవకాశం లేదు. కొంతకాలం ఎంపీ ఎక్కడా నోరు విప్పకూడదని ఆదేశించింది. ఎయిమ్స్ చెప్పిన ప్రకారం కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. కట్టిన కట్లు తీసేసినా ఆరోగ్యం చేకూరే వరకు ఢిల్లీ వదిలి వెళ్లకూడదని తేల్చింది.