చైనాలో సోకిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. కరోనా తాజాగా ఇండియాకు రావడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేంద్రం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కూడా కేటాయించింది. దేశంలో ఇప్పటికీ 25 కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ వైరస్ ప్రభావం విదేశాల్లో చేయాల్సిన షూటింగ్ లు ఆగిపోయాయి. తాజాగా కరోనా వైరస్ ‘బహుబలి’ ప్రభాస్ ను కూడా భయపెట్టింది. కరోనా వైరస్ పై ముందస్తుగా జాగ్రత్తగా డార్లింగ్ ప్రభాస్ మాస్క్ వేసుకొని బయటకు వస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మాస్క్ తో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ ఈ సమావేశాలను కూడా ప్రభావితం చేసింది.
నేడు పార్లమెంట్లో జరిగిన సమావేశాలకు సీనీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ మాస్క్ తో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ప్రజలు అందరూ మాస్క్ లు ధరించాలన్నారు. నిత్యం తమ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతుండంతో కేంద్రం అప్రమత్తం అయింది. కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.