Movie tickets online sales: జగన్ రాజకీయం పై ప్రస్తుతం సినీ పరిశ్రమలో లోలోపలే ప్రకంపనలు రేగుతున్నాయి. ఆ ప్రకంపనల్లో సినీ పెద్దలు అందరూ ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. థియేటర్ టికెట్ రేట్ల విషయంలో జగన్ తీరు ఏ మాత్రం సమంజసం కాదు అని సినిమా వాళ్ళ అభిప్రాయం. నిజానికి స్పందించాల్సిన రీతిలో మొదటే సినిమా వాళ్ళు స్పందించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది.

‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలకు సపోర్ట్ గా నిలవాల్సింది పోయి, జగన్ ప్రభుత్వానికి మద్దతు పలికారు. పవన్ కామెంట్స్ పెను దుమారం రేపిన సందర్భంలోనే పుట్టుకొచ్చిన రాజకీయ రచ్చ పెద్దది కాకుండా సినిమా వాళ్ళు చూసుకున్నారు గాని, తమ సమస్యకీ అసలు పరిష్కారం ఏమిటి అనే కోణంలో మాత్రం ఆలోచించలేదు.
అప్పుడు అలా ఆలోచించి ఉంటే ఇప్పటికే పరిస్థితి చక్క బడేది అని, మనకు అంతా బావుండేదని ఇప్పుడు సినిమా జనం తీరిగ్గా చర్చ జరుపుతున్నారు. అయినా సినిమా టికెట్ ధరల విషయమై జగన్ ప్రభుత్వం ముందు నుంచీ ఒకే మాట నిలబడింది. కాబట్టి.. జగన్ తో పని కాదు అని అర్ధం చేసుకోలేకపోవడం సినిమా వాళ్ళ అమాయకత్వం.
Also Read: Amaravati Farmers: రైతులపై లాఠీచార్జి.. ఎంత అమానుషం
నిజానికి ఈ టికెట్ ‘పంచాయితీ’ తెగడం లేదు అంటే.. దానికి కారణం జగన్ కాదు, సినిమా వాళ్లల్లో యూనిట్ లేకపోవడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయం పేరుతో సినిమా టిక్కెట్ ధరల్ని నియంత్రించేందుకు సన్నాహాలు చేసుకుంటుంటే.. పెద్ద హీరోలు ఇప్పటికీ సైలెంట్ గానే ఉన్నారు. అయినా చివరకు నష్టపోయేది స్టార్ హీరోలే. ఎందుకంటే.. ముందుగా తగ్గేది వాళ్ళ మార్కెటే.
Also Read: AP employees: ఏపీ ఉద్యోగులకు ఎవరి సానుభూతి దక్కదా?