నేటి నుంచి సినిమా థియేటర్లు పున: ప్రారంభం

కరోనా ప్రభావం కారణంగా దాదాపు ఏడు నెలలుగా తెలంగాణలో మూతబడ్డ థియేటర్లు మంగళవారం తెరుచుకోనున్నాయి. నిన్న కేసీఆర్ సినిమా పరిశ్రమకు ప్రకటించిన వరాల్లో భాగంగా థియేటర్లను కూడా 50 శాతం సిట్లతో ఓపెన్ చేసుకోవచ్చన్నారు. ఆన్ లాక్ లో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు పున: ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని చోట్ల కరోనా తీవ్రత కారణంగా మళ్లీ మూతబడ్డాయి. కాగా తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో థియేటర్ల పున: ప్రాంభానికి అవకాశం […]

Written By: Suresh, Updated On : November 24, 2020 10:48 am
Follow us on

కరోనా ప్రభావం కారణంగా దాదాపు ఏడు నెలలుగా తెలంగాణలో మూతబడ్డ థియేటర్లు మంగళవారం తెరుచుకోనున్నాయి. నిన్న కేసీఆర్ సినిమా పరిశ్రమకు ప్రకటించిన వరాల్లో భాగంగా థియేటర్లను కూడా 50 శాతం సిట్లతో ఓపెన్ చేసుకోవచ్చన్నారు. ఆన్ లాక్ లో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు పున: ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని చోట్ల కరోనా తీవ్రత కారణంగా మళ్లీ మూతబడ్డాయి. కాగా తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో థియేటర్ల పున: ప్రాంభానికి అవకాశం ఇచ్చారు. దీంతో సినీ ప్రియుల్లో సందడి నెలకొంది. మరోవైపు ఇప్పటికే సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి. సినీ నటులపై కరోనా ప్రభావం చూపుతున్న కొన్ని సినిమాల చిత్రీకరణ వేగవంతంగా జరుగుతోంది. ఇక షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న వాటికి థియేటర్ల ప్రారంభంతో రిలీఫ్ కానుంది.