Mother’s Day 2025: సృష్టికి మూలం అమ్మ.. ఇలాంటి దేవతను ఈ రోజుల్లో కేవలం మదర్స్ డే రోజు మాత్రమే గుర్తిస్తున్నారు. ఏడాది మొత్తం పట్టించుకోకుండా ఉంటారు. కనీసం రోజులో ఒక పది నిమిషాలు కూడా సమయం కేటాయించరు. కానీ మదర్స్ డే రోజు మాత్రం స్టేటస్‌లు, స్టోరీలు పెట్టి.. అమ్ముకు విషెష్ తెలియజేస్తారు. సెలబ్రేషన్స్ చేసి గిఫ్ట్‌లు ఇస్తారు. ఇదంతా కూడా కేవలం ఒక్క రోజు మాత్రమే జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ తన బిడ్డ నుంచి ఖరీదైన గిఫ్ట్‌లు, సెలబ్రేషన్స్ వంటివి కోరుకోదు. తనని అర్థం చేసుకుని, రోజులో కొంత సమయం తనతో గడపాలని కోరుకుంటుంది. అయితే ప్రతీ ఏడాది మే రెండవ ఆదివారం రోజు మదర్స్ డే జరుపుకుంటారు. కేవలం ఈ ఒక్క రోజు ప్రతీ ఒక్కరికి తల్లి మీద ప్రేమ ఉప్పొంగుతుంది. అయితే మదర్స్ డే రోజు కేవలం విషెష్, స్టేటస్‌లు, బహుమతులు వంటివి కాకుండా అమ్మలకు స్పెషల్‌గా చేయండి. దీనివల్ల అమ్మకు ఆ గుర్తులు చిరకాలంగా ఉండిపోతాయి. మరి అమ్మకు మదర్స్ డే స్పెషల్‌గా ఇవ్వాల్సినవి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: భారత్–పాకిస్తాన్ డ్రోన్ వార్.. యుద్ధంలో సరికొత్త మలుపు!
ప్రేమ
ప్రతీ తల్లి తన బిడ్డల నుంచి ప్రేమను కోరుకుంటుంది. మీ వర్క్ బిజీలో ఉండి తల్లికి కావాల్సిన వాటిని ఇవ్వరు. డబ్బులు ఇచ్చి కొనుక్కోమంటారు. తల్లి మీ నుంచి బహుమతులు కోరుకోదు. మీ చేతులతో కొని తీసుకొస్తే.. ఎంత చిన్న వస్తువుకి అయినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ వంట లేదా ఏదైనా పని చేస్తే వచ్చి మాట్లాడుతూ హెల్ప్ చేయాలి. తనతో కూర్చోని కబుర్లు చెప్పుకోవాలి. ఇలా మీరు చేస్తే చాలు.. తల్లికి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇదే.
సమయం
ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది బిజీగా ఉండి.. కనీసం అమ్మలకు సమయం ఇవ్వడం లేదు. ఏదో మదర్స్ డే అని ఫోన్‌లో స్టేటస్‌లు పెట్టుకుంటారు. అమ్మలకు ఇలా ఫోన్ స్టేటస్‌లో పెట్టుకోకుండా కాస్త గౌరవం, సమయం ఇవ్వండి. మీకు ఎంత పని ఉన్నా కూడా రోజులో కాస్త పది నిమిషాలు అయినా విశ్రాంతి దొరుకుతుంది. ఈ సమయంలో అయినా అమ్మతో హ్యాపీగా గడపండి. అమ్మకు భర్తతో రాని సంతోషం.. బిడ్డలతోనే వస్తుంది. మీరు కాకుండా అమ్మలకు ఇంకా ఎవరు ఉన్నారు చెప్పండి. కాబట్టి మదర్స్ డే మాత్రమే కాకుండా రోజు ఒక పది నిమిషాలు అయినా అమ్మకు సమయం కేటాయించండి.
ఇష్టమైనవి
అమ్మలకు ఎన్నో ఇష్టమైనవి ఉంటాయి. కాకపోతే పిల్లల కోసం వాటిని వదులుకుంటారు. చాలా మంది కేవలం మదర్స్ డే రోజున అమ్మలకు గిఫ్ట్ ఇస్తారు. ఇలా కాకుండా అప్పుడప్పుడు అమ్మలకు ఇష్టమైన వాటిని ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి. ఇలా చేయడం వల్ల అమ్మలు చాలా సంతోష పడతారు. తమకి ఇష్టమైన వాటిని తెలుసుకుని అడగకుండా ఇచ్చారని ఆనంద పడతారు.
హ్యాపీగా ఫీల్ అయ్యే పనులు
కొందరు వాళ్లకి నచ్చినట్లు ఉంటారు. ఇలా కాకుండా అమ్మలకు నచ్చినట్లు ఉండండి. ధరించే దుస్తులు, తినే ఆహారం ఇలా అమ్మలకు నచ్చినట్లు ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగని మీకు ఇష్టం లేని పనులు చేయాలని కాదు.. అమ్మ కోసం మీరు మీ ఇష్టాలను కూడా మార్చుకోగలిగేంత ప్రేమ ఉండాలి. ఇది కూడా ఒక రకమైన ప్రేమే. ఈ మదర్స్ డే మీ అమ్మలకు స్పెషల్‌గా ఉండాలంటే ఏదైనా కొత్తగా ఇలా చేయండి.