Most Wanted Thief Arrested: అతడిదో ప్రత్యేక శైలి. దొంగతనాలు చేయడంలో అందెవేసిన చేయి. అతడు కల గన్నాడో ఇక అంతే సంగతి. ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే. అతడికి వచ్చే కలలు అలా ఉంటాయి. రాత్రి కల వస్తే ఇల్లు కొల్లగొట్టాల్సిందే. ఇప్పటికి పలు దొంగతనాలు చేసినా జైలుకు వెళ్లినా అతడి వృత్తి మాత్రం మానలేదు. నిరంతరం అదే ధ్యాసలో ఉంటాడు. చోరకళనే నమ్ముకుని జీవిస్తున్నాడు. చివరకు పోలీసులకు చిక్కడంతో అతడి వివరాలు పోలీసులు వెల్లడించారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గాంధీనగర్ కు చెందిన మచ్చు అంబేద్కర్ (50) అలియాస్ రాజు, రాజేష్, ప్రసాద్, కందుల రాజేందర్ తదితర పేర్లతో సంచరిస్తుంటాడు. ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నా తన ఇరవయ్యో ఏట నుంచి దొంగతనాల్లో ఆరితేరాడు. ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఇందిరాపార్కు వద్ద కాలిబాటపై పడుకున్నాడు. కలలో రాత్రి ప్రాంతంలో సంచరించి పగలు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనం చేయడం అలవాటుగా మార్చుకున్నాడు.
Also Read: Gram Panchayat AP: పండుగ పూట షాక్.. పంచాయతీల ఖాతాలు గుల్ల
1990లో తొలిసారిగా కార్ఖానా, లాలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నాలుగు ఇళ్లలో దొంగతనం చేసి జైలుకెళ్లాడు. తరువాత చిక్ పేట పరిధిలో నాలుగు ఇళ్లలో చోరీ చేసి ఊచలు లెక్కపెట్టాడు. 2016-22 మధ్య 43 దొంగతనాలు చేశాడు. సొత్తును గుంటూరులో భద్రపరచాడు. వనస్థలిపురం పరిధిలో భూగర్భగనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తాతా శ్యాంరావు ఇంట్లో గత అక్టోబర్ లో దొంగతనానికి పాల్పడ్డాడు.

వనస్థలిపురం వైదేహినగర్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న అంబేద్కర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనాల వివరాలు తెలిశాయి. పగటి వేళల్లో రెక్కీ నిర్వహించి రాత్రి పూట దొంగతనాలు చేయడం అతడికి బాగా కుదిరింది. దీంతో ఇదే సెంటిమెంట్ తో చోరీలు చేస్తూ దొరకకుండా తిరుగుతున్నాడు. దర్జాగా చోరీలు చేయడంతో నగలు, నగదు కూడా భారీగానే కూడబెట్టాడు. దీంతో అంతా పోలీసులు స్వాధీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Warangal MGM Hospital: అత్యంత అమానవీయ ఘటన.. ఎలుకలు కొరికిన వ్యక్తి మృతి..