Homeఆంధ్రప్రదేశ్‌Gram Panchayat AP: పండుగ పూట షాక్.. పంచాయతీల ఖాతాలు గుల్ల

Gram Panchayat AP: పండుగ పూట షాక్.. పంచాయతీల ఖాతాలు గుల్ల

Gram Panchayat AP: పండుగల నాడు ప్రభుత్వాలు వరాలు ప్రకటిస్తాయి. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడతాయి. ప్రజోపయోగ పనులు చేపడతాయి. కానీ అందుకు జగన్ సర్కారు మాత్రం. తెలుగు ప్రజల తొలి పండుగ నాడే ఝలక్ ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం తొలి రోజునే పంచాయతీలకు తేరుకోలని షాక్ ఇచ్చింది. ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కేందుకు పంచాయతీల సొమ్ముపై కన్నేసింది. పంచాయతీలు పన్నుల రూపంలో వసూలు చేసుకున్న మొత్తాలను కూడా తీసేసుకుంది. గత ఏడాది డిసెంబరులో రూ.7660 కోట్ల ఆర్థిక సంఘం నిధులను సొంత ఖాతాకు మళ్లించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు పంచాయతీలకు చెందిన ‘జనరల్‌ ఫండ్స్‌’ను గుట్టుచప్పుడు కాకుండా లాక్కుంది. దీంతో పంచాయతీ సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 12,918 పంచాయతీల ఖాతాలనూ ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. గురువారం వరకు ఖాతాల్లో ఉన్న నిధులు శుక్రవారానికి పూర్తిగా మాయం కావడంతో సర్పంచులు హతాశులయ్యారు. ఖాతాలు ‘జీరో’ బ్యాలెన్స్‌ చూపుతున్నాయని వాపోయారు.

Gram Panchayat AP
Gram Panchayat AP

వాస్తవానికి పేరుకే స్థానిక సంస్థలు కానీ.. రాష్ట్రంలో వాటి హక్కును ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. ఒక్కో హక్కు, విధులను దూరం చేస్తూ వచ్చింది. అటు సంక్షేమ పథకాల అమలు, పర్యవేక్షణ, అభివ్రద్ధి పనులు, పన్నుల వసూలు బాధ్యతలను సచివాలయాలకు అప్పగించింది. పైగా 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించింది. దీంతో పంచాయతీ సర్పంచ్ లకు గ్రమాల్లో కనీస విలువ లేకుండా పోయింది. చిన్నపాటి పనికైనా ప్రజలు వలంటీర్లనే ఆశ్రయిస్తున్నారు.

Also Read: Crazy Update On Rajamouli Mahabharatam: రాజమౌళి ‘మ‌హా భార‌తం’ పై క్రేజీ అప్ డేట్.. రెండు పాత్రల్లో ఎన్టీఆర్

ప్రారంభంలో వలంటీరు వ్యవస్థను ఆహ్వానించిన అధికార పార్టీ నేతలకు సైతం ఇది మింగుడు పడడం లేదు. కొన్ని గ్రమాల్లో సర్పంచ్ లకు సమాంతరంగా ఒక వర్గాన్నే నడిపిస్తున్నారు వలంటీర్లు. దీనిపై అధికార పార్టీ సర్పంచ్ లు సైతం బాహటంగా విమర్శించిన సందర్భాలున్నాయి. సర్పంచ్ కే కేవలం ఉత్సవ విగ్రహంలా మార్చింది వైసీపీ సర్కారు. అనతికాలంగా వస్తున్న ప్రధాన విధుల ను సైతం దూరం చేసింది. ఏటా ఆగస్టు 15 నాడు పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను సర్పంచ్ లే ఆవిష్కరించేవారు. కానీ వైసీపీ సర్కారు ఆ బాధ్యతలను సైతం పాఠశాల పేరెంట్స్ కమిటీ ప్రతినిధులకు అప్పగించింది. దీనిపై అధికార పార్టీ సానుభూతిపరులైన సర్పంచ్ ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ప్రభుత్వ పట్టించుకోలేదు.

Gram Panchayat AP
Y S Jagan

కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులకు సైతం లెక్కా పత్రం లేదు. 14, 15 ఆర్థిక సంఘం నిధులు రూ.7,660 కోట్లకు అసలు లెక్క చెప్పలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి… ఇప్పుడు జనరల్‌ ఫండ్స్‌ను కూడా లాక్కున్నారని విమర్శిస్తున్నాయి. పంచాయతీలు ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసి, ఖాతాల్లో జమ చేసిన సొమ్మునూ లాక్కోవడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. శుక్రవారం పంచాయతీ ఖాతాల నుంచి నగదు కనిపించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చనీయాంశమైంది. సర్పంచ్‌లందరూ తమ పంచాయతీ ఖాతాలను చెక్‌ చేసుకుంటున్నారు. దీనిపై అధికార పార్టీ సర్పంచ్ లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం, పంచాయతీరాజ్‌ చాంబర్‌ ద్వారా పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. వాస్తవానికి పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరిన గత ఏడాది మార్చి నాటికి 14వ ఆర్థిక సంఘం ఖర్చు కాకుండా మిగిలిపోయాయి. వాటిని ఎలాగైనా కాజేయాలన్న ప్రయత్నంలో విద్యుత్ బిల్లుల బకాయిలు సాకుగా చూపి ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది. అప్పట్టోనే పెద్ద దుమారం రేగింది. అయితే అప్పుడే పాలకవర్గ బాధ్యతలు తీసుకున్న సర్పంచ్లు దీనిని లైట్ గా తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం గట్టి పోరాటానికి సన్నద్ధమవుతున్నారు.

Also Read: Governor Tamilisai: గవర్నర్ కు షాక్: ఉగాది వేడుకకు హాజరు కాని సీఎం, మంత్రులు.. తగ్గేదేలే అంటున్న తమిళిసై

Exit mobile version