Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ మూడో విడత ఎన్నికల ప్రచారం కోసం నేడు తెరపడనుంది. దేశంలోనే పెద్ద రాష్ట్రం కావడంతో అందరి కన్ను దానిపైనే పడింది. ఇప్పటికే బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ తీవ్రం అయింది. సర్వేలు కూడా ఆ రెండు పార్టీలకే విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడు విడతల పోలింగ్ కు ప్రచారం పూర్తి కావడంతో పార్టీలు విజయంపై ఆశలు పెట్టుకున్నాయి. దీంతో ఎన్నికల్లో తమ ప్రభావం చూపేందుకు అన్ని మార్గాలు వెతుకుతున్నాయి.
ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది కోటీశ్వరులున్నట్లు తెలుస్తోంది. అన్ని పార్టీలు తమ పలుకుబడి కోసం డబ్బు ఉన్న వారికే ప్రాధాన్యం ఇచ్చాయి. దీంతో కోటీశ్వరులే తమ తలరాతను పరిశీలించుకోనున్నారు. విజయం సాధించి ప్రజా సేవ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. యూపీలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం పూర్తి కావడంతో ఇక తమజాతకాలు ఎలా ఉన్నాయనే దాని మీదే అందరు చర్చించుకుంటున్నారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది నేరస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలో పోటీ చేసిన పార్టీల అభ్యర్థుల్లో ఎక్కువ మంది నేరస్తులే కావడం గమనార్హం. ఏదో ఒక కేసులో శిక్ష అనుభవించిన వారే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పార్టీలకు వేరే అభ్యర్థులు దొరకలేదా అనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఒక పార్టీ అంటే కాదు అన్ని పార్టీల్లో కూడా నేరాలు చేసిన వారు ఉండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Also Read: మేడారానికి కేసీఆర్.. అమ్మవార్ల కోసం నిర్ణయం
దీంతో అధికారంపై అన్ని పార్టీలు గురి పెట్టాయి. అధికారమే పరమావధిగా కదులుతున్నాయి. అన్ని వర్గాల ఓట్లు రాబట్టుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థి ఖర్చు ఎన్నికల నియమావళిని మించి పోతోంది. దీంతో ప్రజలను ప్రసన్నం చేసుకునే క్రమంలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
యూపీలో ఎన్నికల ముఖచిత్రం మారిపోతోంది. ఇన్నాళ్లు ప్రచారంతో హోరెత్తించినా ప్రస్తుతం పైసలతో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓటర్ల కోసం భారీగా డబ్బులు పంచేందుకు అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. రాత్రికి రాత్రే అన్ని ప్రాంతాల్లో డబ్బు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి యూపీలో ఎన్నికల తంతు ఎక్కడికి వెళ్తుందో చెప్పలేం.
Also Read: గౌతం సవాంగ్ బదిలీతో జగన్ కు చిక్కులేనా?