దేశంలో ఎక్కువ కేసులు ఏపీ పోలీసులపైనే.. ఎందుకో తెలుసా?

దేశవ్యాప్తంగా ఏ పోలీసులపై ఎక్కువ కేసులు నమోదయ్యాయని ఆరాతీస్తే ఆశ్చర్యకర విషయం వెలుగుచూసింది.  అందరూ కరుకుగా ఉండే ఉత్తరప్రదేశో.. లేక అల్లకల్లోలంగా ఉండే బీహార్ పోలీసులో అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే వారు కాదు.. మన ఏపీ పోలీసులే దేశంలో ఎక్కువ కేసులు నమోదై ఉన్నారు. ఇది నిజంగా లెక్కతేలిన నిజం మరీ.. Also Read: ఉద్యోగులకు మేలు చేసేలా కేంద్రం కొత్త నిబంధనలు..? రెండు తెలుగు రాష్ట్రాల కన్నా పెద్దదైన […]

Written By: NARESH, Updated On : October 3, 2020 7:48 pm
Follow us on

దేశవ్యాప్తంగా ఏ పోలీసులపై ఎక్కువ కేసులు నమోదయ్యాయని ఆరాతీస్తే ఆశ్చర్యకర విషయం వెలుగుచూసింది.  అందరూ కరుకుగా ఉండే ఉత్తరప్రదేశో.. లేక అల్లకల్లోలంగా ఉండే బీహార్ పోలీసులో అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే వారు కాదు.. మన ఏపీ పోలీసులే దేశంలో ఎక్కువ కేసులు నమోదై ఉన్నారు. ఇది నిజంగా లెక్కతేలిన నిజం మరీ..

Also Read: ఉద్యోగులకు మేలు చేసేలా కేంద్రం కొత్త నిబంధనలు..?

రెండు తెలుగు రాష్ట్రాల కన్నా పెద్దదైన మహారాష్ట్రలో పోలీసులపై 403 కేసులు నమోదు కాగా..  ఆ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. అసోం 397 కేసులతో మూడో స్థానంలో ఉంది. పోలీసులపై కేసులు తప్పనిసరిగానే నమోదు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరుతెన్నులపై జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది.  దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ పోలీసులపై గత ఏడాది భారీగా కేసులు నమోదయ్యాయి. భారతదేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసులపై నమోదైన కేసులన్నీ కలిపితే 4068. ఇందులో ఒక్క ఏపీ పోలీసులపైనే ఏకంగా 1681 కేసులు ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.

ఏపీలో 1600 మందికి పైగా పోలీసులపై కేసులు ఉన్నా ఎనిమిది కేసుల్లోనే విచారణ పూర్తయ్యింది. అన్ని కేసుల్లోనూ నేరారోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు నిర్ధోషులుగా బయటపడ్డారు. కోర్టులు ఎనిమిది కేసుల్ని క్వాష్ చేశాయి. ఏడు కేసుల్ని ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది.

Also Read: నయీం కేసులో సంచలనం..మరో కీలక పరిణామం

ఏపీ రాష్ట్ర పోలీసులపై నమోదైన 1681 కేసుల్లో 302 కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎన్.సీ.ఆర్.బీకి పోలీసు శాఖ వివరాలు తెలిపింది.

ఇలా ఏపీ పోలీసులే కేసుల్లో దేశంలోనే టాప్ లో ఉన్నారని అర్థమవుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ అయ్యాక పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు కేసు పెట్టడం.. వారంతా వివాదాల్లో ఇరుక్కోవడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది.