Homeఎంటర్టైన్మెంట్శ్రీముఖి కేకల పై నాగబాబు కామెంట్స్ !

శ్రీముఖి కేకల పై నాగబాబు కామెంట్స్ !


బుల్లితెర రాములమ్మ అంటూ శ్రీముఖికి ఒక బ్రాండ్ ఉంది. దీనికి తోడు శ్రీముఖి చేసే రచ్చ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆవిడగారు ఏ రేంజ్‌లో శబ్దాలు చేస్తుందో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీగడపను అడిగినా చెబుతుంది. పటాస్ షోతో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్న శ్రీముఖి.. ఆ తరువాత కొన్ని హాట్ కామెంట్స్ తో కుర్రకారును బాగానే ఎంటర్ టైన్ చేసింది. అలాగే బిగ్ బాస్ షోతో కూడా ఈ బబ్లీ బ్యూటీ భారీ ఫాలోయింగ్‌ నే సంపాదించుకుంది. సరే ఫాలోయింగ్ పాపులారిటీ ఎలా ఉన్నా.. శ్రీముఖి నెగెటివిటీని కూడా బాగానే తెచ్చుకుంది. మధ్యలో బోల్డ్ కామెంట్స్ తో కాంట్రవర్సీల్లోనూ శ్రీముఖి అల్లరి చేసింది.

Also Read: ‘కృష్ణ’ కలయికలో సక్సెస్ కొడతారా ?

ఎంతైనా బిగ్ బాస్ షోలో లౌడ్ స్పీకర్ అనే అవార్డును సొంతం చేసుకున్న శ్రీముఖి అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ఆమె అరుపులకు టీవీ స్పీకర్లు కూడా బద్దలవుతున్నాయేమో అన్నట్లు ఉంటాయి ఆవిడగారి కేకలు. అందుకే ఏ యాంకర్ మీద రాని సెటైర్లు శ్రీముఖి మీద వచ్చాయి. ఆమె కనిపిస్తే టీవీని మ్యూట్‌లో పెట్టాల్సి వస్తుందని నెటిజన్లు ఆ మధ్య తెగ ట్రోలింగ్ చేశారు. ఓ సందర్భంలో నాగార్జున సైతం శ్రీముఖి తో అరుపులను కంట్రోల్ చేసుకోమని.. నీ కేకలు మా ఇంటి వరకు వినిపిస్తున్నాయని కౌంటర్లు వేశాడంటే.. అది శ్రీముఖి గొంతు రేంజ్. మొత్తానికి అమెను అందరూ లౌడ్ స్పీకర్ అని ఎగతాళి చేస్తున్నా ఆమె మాత్రం తన అరుపులను తగ్గించట్లేదు.

Also Read: బిగ్ బాస్ కు అవినాష్ ఎందుకు వెళ్లాడో చెప్పిన హైపర్ ఆది

తాజాగా శ్రీముఖి ‘బొమ్మ అదిరింది’ షోలో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘అదిరింది’ అనే ప్లాప్ షోకు కొన్ని రిపేర్లు చేయడంతో ఈ ‘బొమ్మ అదిరింది’ షో బయటకు వచ్చింది. ఇందులో భాగంగా యాంకర్ రవి, భాను శ్రీ స్థానంలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. స్టేజ్ మీదకు ఎంట్రీ ఇస్తూనే నాగబాబును చూసి.. మీరు వెళ్లి ప్రశాంతంగా కూర్చోండి అని కామెంట్ చేసింది. దానికి నాగబాబు రియాక్ట్ అవుతూ ‘నువ్వు ఉండగా ఇంక ప్రశాంతత ఎక్కడుంటుంది’ అని కౌంటర్ వేయడంతో అక్కడున్న మొహాల్లో నవ్వు వెలిగిపోయింది. కానీ శ్రీముఖి మొహం మాత్రం మాడిపోయింది. వెంటనే తేరుకుని ‘ సర్ మీరు కూడానా’ అంటూ సరదాగా నవ్వలేక ఒక నవ్వు నవ్వేసింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version