అమెరికా అధ్యక్ష ఎన్నిక.. ఇండియన్ అమెరికన్లు ఎటువైపు?

కరోనా సమయంలోనూ అమెరికాలో రాజకీయాలు హిటెక్కాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో డెమొక్రటిక్.. రిపబ్లిక్ పార్టీ మధ్య ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయి. ఈనేపథ్యంలో ఇరుపార్టీలు ఇండియన్ అమెరికన్లు ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. Also Read: సిరియా అధ్యక్షుడిని చంపిద్దామనుకున్న… ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ ఇండియన్లు ఎవరికీ మద్దతు ఇస్తే వారే ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. దీంతో ఈసారి […]

Written By: NARESH, Updated On : September 17, 2020 11:25 am

Indo americans

Follow us on


కరోనా సమయంలోనూ అమెరికాలో రాజకీయాలు హిటెక్కాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో డెమొక్రటిక్.. రిపబ్లిక్ పార్టీ మధ్య ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయి. ఈనేపథ్యంలో ఇరుపార్టీలు ఇండియన్ అమెరికన్లు ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Also Read: సిరియా అధ్యక్షుడిని చంపిద్దామనుకున్న… ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మెజార్టీ ఇండియన్లు ఎవరికీ మద్దతు ఇస్తే వారే ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. దీంతో ఈసారి ఇండియన్ అమెరికన్లు ఎవరీ వైపు మొగ్గుచూపుతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. దీనిపై ఓ స్వచ్చంధ సంస్థ, ఏఏపీఐకి చెందిన సంస్థతో కలిసి సర్వే చేపట్టింది. ఇండియన్ల నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నం చేసింది. ఈ సర్వే వివరాలను బట్టి ఇండియన్ అమెరికన్లు ఎవరి వైపు మొగ్గుచూపుతున్నారో వెల్లడించింది.

ఈసారి ఇండియన్ అమెరికన్లు డెమొక్రటిక్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు సర్వే ద్వారా తెలుస్తోంది. దాదాపు 66మంది ఇండియన్ అమెరికన్లు డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ కు మద్దతు ప్రకటించగా.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కు 28శాతం మంది మద్దతు ఇచ్చారట. ఇక మిగిలిన ఆరుశాతం మంది ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సర్వేలో వెల్లడైందట. అయితే గతంలో డెమొక్రట్ పార్టీ తరుఫున పోటీచేసిన మాజీ అధ్యక్షుడు ఒబామాకు 84శాతం.. హిల్లరి క్లింటర్ ను 77శాతం మంది ఇండియన్ అమెరికన్లు మద్దతు ప్రకటించారు. కాగా జో బిడెన్ మాత్రం 66శాతం మాత్రమే మద్దతు ఇవ్వడంతో మరింత మందిని ఆకట్టుకునేందుకు డెమొక్రటిక్ పార్టీ సన్నహాలు చేస్తోంది.

Also Read: చైనాపై భారత్‌ విజయం

ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారత్ తో సత్సంబధాలు కొనసాగిస్తున్నారు. అయితే ఆయన హెచ్1 వీసాల విషయంలో ఇటీవల వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా అమెరికాలో కరోనాను కట్టడి చేయడంలో విఫలం కావడం.. నిరుద్యోగం పెరగడం..అమెరికేతరుల పట్ల వివక్ష చూపడం.. నల్లజాతీయుల పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుతో ఇండియన్ అమెరికన్లు డెమొక్రటిక్ అభ్యర్థివైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అమెరికా వైస్ ప్రెసిడెంట్ డెమొక్రటిక్ పార్టీ ఇండో ఆఫ్రికన్ కమలహారిస్ ను ప్రకటిండం కూడా ఇందుకు ఓ కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.