https://oktelugu.com/

ఏబీఎన్ ను పగబట్టిన కరోనా..

కరోనా మీడియా సంస్థల పాలిట మృత్యుపాశంగా మారింది. ఇప్పటికే పరోక్షంగా.. ప్రత్యక్షంగా ఎందరినో బలితీసుకున్న ఈ మహమ్మారి.. మరోసారి తన ప్రభావాన్ని చూపుతోంది. గతేడాది ఇదే సమయంలో కోరలు చాచుకుని మీడియా సంస్థలపై విరుచుకుపడిన కోవిడ్ 19 వైరస్ మరోసారి తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. ఒక దశలో చావుతప్పి కన్నులొట్టపోయిన పరిస్థితుల్లో మీడియా సంస్థల ఉద్యోగులు బతుకు జీవుడా అన్నట్లు భయం.. భయంతో ఉద్యోగాలు చేస్తుంటే.. మహమ్మారి మళ్లీ భయపెడుతుండడం కొంత మేర ఆందోళన కలిగిస్తోంది. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2021 / 11:56 AM IST
    Follow us on


    కరోనా మీడియా సంస్థల పాలిట మృత్యుపాశంగా మారింది. ఇప్పటికే పరోక్షంగా.. ప్రత్యక్షంగా ఎందరినో బలితీసుకున్న ఈ మహమ్మారి.. మరోసారి తన ప్రభావాన్ని చూపుతోంది. గతేడాది ఇదే సమయంలో కోరలు చాచుకుని మీడియా సంస్థలపై విరుచుకుపడిన కోవిడ్ 19 వైరస్ మరోసారి తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. ఒక దశలో చావుతప్పి కన్నులొట్టపోయిన పరిస్థితుల్లో మీడియా సంస్థల ఉద్యోగులు బతుకు జీవుడా అన్నట్లు భయం.. భయంతో ఉద్యోగాలు చేస్తుంటే.. మహమ్మారి మళ్లీ భయపెడుతుండడం కొంత మేర ఆందోళన కలిగిస్తోంది.

    Also Read: అంతా నేనే చేయాలి.. అంతా నాకే కావాలి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా జానా తీరు ఇదీ..

    గతేడాది దేశవ్యాప్తంగా మీడియా సంస్థలను అతలాకుతలం చేసింది కరోనా.. దాదాపు ప్రతీ మీడియా సంస్థలోని అన్ని విభాగాల ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. కాలం గడుస్తున్నకొద్ది కొంతమంది దానికి బలయ్యారు. మరికొంత మంది కోలుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఇంకొందరు ఉద్యోగాలు కోల్పోయి బతుకువేట సాగిస్తున్నారు. అయితే అంతా సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో మరోసారి మీడియాపై కరోనా ప్రభావం చూపిస్తోంది. హైదరాబాద్ లోని ఏబీఎన్ ప్రధాన కార్యాలయంలో కరోనా కోరలు చాచింది. ఒకరుకాదు ఇద్దరు కాదు.. ఏకంగా 20మందికి పైగానే ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.

    లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా సడలించిన తరువాత ప్రజలంతా కరోనాను చాలా వరకు లైట్ తీసుకున్నారు. మరోవైపు పొరుగురాష్ట్రం మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా కొత్తకేసుల సంఖ్య పెరిగిపోతోంది. అయినప్పటికీ.. హైదరాబాద్ లో జాగ్రత్తలు కరువయ్యాయి. ప్రజలంతా మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. భౌతిక దూరం పాటించకుండానే సమూహాల్లో కలిసిపోతున్నారు. ఏబీఎన్ ఉద్యోగులు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

    Also Read: ట్రంపు.. కంపు.. అమెరికా అత్యంత చెత్త అధ్యక్షుడు ఇతడేనంటా…

    గతేడాది కరోనా దెబ్బకు ఏబీఎన్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. ఉన్న ఫలంగా వందలాది మంది ఉద్యోగాలను సంస్థ కోత పెట్టంది యాజమాన్యం. కరోనా బూచీని చూపించి.. కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ఇళ్లకు పంపించేసింది. అలా అరకొర సిబ్బందితో నడుస్తున్న ఈ సంస్థను మరోసారి కరోనా పట్టిపీడిస్తోంది. కరోనా సోకిన వారంతా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. వాళ్లతో కాంటాక్టు అయిన వారు కూడా ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం తక్కువ మంది సిబ్బందితో ఆ చానెల్ సాగుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్