ఈఎంఐ మారటోరియంపై లోపించిన స్పష్టత

కరోనా మహమ్మారి దృష్ట్యా ఈఎంఐల చెల్లింపుపై మూడు నెలల పాటు ఆర్బీఐ విధించిన మారటోరియంపై ప్రజలలో ఇంకా స్పష్టత వ్యక్తం కావడం లేదు. ఇది అందరికి వర్తిస్తుందా లేవలం ఈ సౌలభ్యం కావాలని కోరుకున్న వారికే వర్తిస్తుందా అనే విషయమై కూడా ఇంకా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు స్పష్టత ఇవ్వవలసి ఉంది. కేవలం ఎస్బీఐ మాత్రమే తమ కస్టమర్లందరి టర్మ్‌ లోన్లు ఆటోమేటిగ్గా మూడు నెలలు వాయిదా పడుతాయని ప్రకటించింది. మారటోరియం తీసుకున్నవారికి మార్చి, ఏప్రిల్‌, మే […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 2:05 pm
Follow us on

కరోనా మహమ్మారి దృష్ట్యా ఈఎంఐల చెల్లింపుపై మూడు నెలల పాటు ఆర్బీఐ విధించిన మారటోరియంపై ప్రజలలో ఇంకా స్పష్టత వ్యక్తం కావడం లేదు. ఇది అందరికి వర్తిస్తుందా లేవలం ఈ సౌలభ్యం కావాలని కోరుకున్న వారికే వర్తిస్తుందా అనే విషయమై కూడా ఇంకా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు స్పష్టత ఇవ్వవలసి ఉంది.

కేవలం ఎస్బీఐ మాత్రమే తమ కస్టమర్లందరి టర్మ్‌ లోన్లు ఆటోమేటిగ్గా మూడు నెలలు వాయిదా పడుతాయని ప్రకటించింది. మారటోరియం తీసుకున్నవారికి మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన కిస్తీ చెల్లింపుల నుంచి తాత్కాలికంగా మినహాయింపు లభిస్తుంది.

ఈ మూడు నెలల ఈఎంఐలను బ్యాంకులు తిరిగి ఎలా వసూలు చేసుకుంటాయి? అన్నదానిపై సహితం స్పష్టత వెల్లడి కావడం లేదు. ఇది రద్దు కాదని, వాయిదా మాత్రమే అని ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. మనం చెల్లించే వాయిదాలలో అసలు మొత్తం కన్నా వడ్డీ మొత్తం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మూడు నెలల పాటు వాయిదా పడిన మొత్తాలపై కూడా తిరిగి అదనంగా వడ్డీ చెల్లింపు వలసి వస్తుందా ? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అలాగే మారటోరియంతో ఈఎంఐ మారబోదని, రుణ కాలపరిమితి మాత్రమే కాస్త పెరుగుతుందని చెబుతున్నారు. ఈ విషయంలో కూడా ఇంకా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు స్పష్టమైన విధానం ప్రకటించలేక పోతున్నాయి. కొత్త నెల ప్రారంభం కాబోతుండటం, ఈఎంఐలు చెల్లించే సమయం ఆసన్నం కావడంతో ఈ విషయమై తక్షణం ఒక నిర్ణయాన్ని ప్రకటించవలసి ఉంది.

ఈఎంఐలు చెల్లించకపోయినా డిఫాల్ట్‌ కాబోమని, మన క్రెడిట్‌ స్కోర్‌కూ వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టత ఏర్పడినా, వెసులుబాటు ఉన్న వారు ఏమి చేయాలనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పుడే చెల్లిస్తే ప్రయోజనమా లేదా ఈ వెసులుబాటును ఉపయోగించుకొంటె ప్రయోగాజనమా అనే సందేశాలు వ్యక్తం అవుతున్నాయి.

వీలున్న వారు ఈఎంఐలను యథాతథంగా చెల్లించుకుంటేనే లాభమని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే మారటోరియం తీసుకోవాలనుకున్నవారు ఈ మూడు నెలల మొత్తం ఆపడం వల్ల అంతకంటే ఎక్కువ లాభం ఉంటుందా? అన్నదానిపై ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. ఏదిఏమైనా కరోనా ధాటికి ఆదాయం ప్రభావితమైన వారందరికీ ఆర్బీఐ నిర్ణయం మాత్రం గొప్ప ఊరటేనన్న ఖచ్చితంగా చెప్పవచ్చు.