https://oktelugu.com/

తెలంగాణలో పెరిగిన కరోనా మృతుల సంఖ్య

తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య ఒక్కసారిగా ఆరుకు పెరిగింది. వీరంతా కూడా ఢిల్లీలోని మర్కజ్ లో ప్రార్థన కోసం వెళ్లినవారే కావడంతో భయాందోళన నెలకొంది. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఢిల్లీ వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని తిరిగొచ్చిన వారు తమ వివరాలను వెల్లడించాలని తెలంగాణ సీఎంఓ కోరింది. వీరందరికీ ఉచితంగా పరీక్షలు, వైద్యం చేయిస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు విడిచారు. గాంధీ ఆసుపత్రిలోలో ఇద్దరు, గ్లోబల్ ఆసుపత్రిలో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, గద్వాలలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 31, 2020 / 11:24 AM IST
    Follow us on

    తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య ఒక్కసారిగా ఆరుకు పెరిగింది. వీరంతా కూడా ఢిల్లీలోని మర్కజ్ లో ప్రార్థన కోసం వెళ్లినవారే కావడంతో భయాందోళన నెలకొంది. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఢిల్లీ వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని తిరిగొచ్చిన వారు తమ వివరాలను వెల్లడించాలని తెలంగాణ సీఎంఓ కోరింది. వీరందరికీ ఉచితంగా పరీక్షలు, వైద్యం చేయిస్తామని ప్రకటించింది.

    ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు విడిచారు. గాంధీ ఆసుపత్రిలోలో ఇద్దరు, గ్లోబల్ ఆసుపత్రిలో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, గద్వాలలో ఒకరు మృతిచెందారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు, వారితో కాంటాక్ట్ వున్నవారిని క్వారంటైన్లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించింది. మృతుల్లో పాతబస్తీకి చెందిన జర్నలిస్ట్, ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు.

    మార్చి 13నుంచి 15తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది వరకు పాల్గొన్నట్లు సమాచారం. ఈ ప్రార్థనల్లో థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిజికిస్థాన్ తదితర దేశాలకు చెందినవారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 280మంది ఈ ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి 186మంది, నిర్మల్ నుంచి 11, ఆదిలాబాద్ నుంచి 10, నిజామాబాద్ నుంచి 18, మెదక్ నుంచి 26, రంగారెడ్డి నెంయి 15, ఖమ్మం నుంచి 15, వరంగల్ నుంచి 25, నల్గొండ నుంచి 21, కరీంనగర్ నుంచి 17, భైంసా 11మంది వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి 500మంది వరకు పాల్గొన్నట్లు సమాచారం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.