నేను సైతం అంటున్న పవన్ కళ్యాణ్

సమాజానికి విపత్తు వచ్చినపుడు రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్క త్రాటిపైకి రావడమే మానవత్వం అనిపించు కొంటుంది. ఆ విషయం లో మిగతావారి సంగతి ఎలా వున్నా పవన్ కళ్యాణ్ మాత్రం తన వంతు ధర్మాన్ని చక్కగా పాటించాడు కరోనా విపత్తు కి సాయంగా తన వంతుగా రూ.2 కోట్ల విరాళం ప్రకటించడమే కాక.. జనాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తమిళ నాడు ప్రభుత్వాన్ని కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమాచారం […]

Written By: admin, Updated On : March 31, 2020 6:42 pm
Follow us on

సమాజానికి విపత్తు వచ్చినపుడు రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్క త్రాటిపైకి రావడమే మానవత్వం అనిపించు కొంటుంది. ఆ విషయం లో మిగతావారి సంగతి ఎలా వున్నా పవన్ కళ్యాణ్ మాత్రం తన వంతు ధర్మాన్ని చక్కగా పాటించాడు కరోనా విపత్తు కి సాయంగా తన వంతుగా రూ.2 కోట్ల విరాళం ప్రకటించడమే కాక.. జనాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తమిళ నాడు ప్రభుత్వాన్ని కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమాచారం ఇచ్చి మేల్కొలపడం విశేషం.

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం గొలగండి గ్రామం నుంచి చేపల వేట కోసం తమిళనాడు తీరానికి వెళ్లిన 30 మంది మత్స్యకారులు లాక్ డౌన్ వల్ల చెన్నై హార్బర్లో చిక్కుకుపోయారని.పవన్ కళ్యాణ్ కి తెలిసింది వారికి సరైన వసతి, భోజనం లేక వాళ్లంతా ఇబ్బంది పడుతుండటంతో జనసేన నాయకుల ద్వారా ఆ విషయం తెల్సుకొన్నాడు . వెంటనే ఆ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రికి తెలియ జేసి వారికి తగిన సదుపాయాలు కల్పించవలసిందిగా కోరాడు .

తమిళంలో కూడా ఈ మెసేజ్ రాయించి తమిళ మీడియా వాళ్లకి చేరవేయడం తో వాళ్ళు అక్కడి అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. దీంతో చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాళ్ల ముఖ్య మంత్రి తో ఈ విషయం చర్చించగా తక్షణమే రక్షణ ఏర్పాట్లు జరిగాయి. కాగా తమిళనాడు ముఖ్య మంత్రి పళనిస్వామి ఈ విషయాన్ని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలపడం జరిగింది.